డిస్కో రాజా టీజర్ డేట్ ఫిక్స్ చేసిన మాస్ రాజా

మాస్‌రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం డిస్కో రాజా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయని రవితేజ ఈ ఏడాదిలో రెండు సినిమాలను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఇందులో క్రియేటివ్ డైరెక్టర్‌గా మార్క్ వేసుకున్న విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ థ్రిల్లర్ ‘డిస్కో రాజా’ షూటింగ్ పనులు ముగించుకుంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు వదలాలని చూస్తున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్‌ను ఇప్పటికే రిలీజ్ చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నుండి మరో టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా నుంచి మరో టీజర్‌ను ‘టీజర్ 2.0’ అంటూ జనవరి 13న సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

అయితే ఈ టీజర్‌లో సమ్‌థింగ్ స్పెషల్ ఉందని చిత్ర వర్గాలు అంటున్నాయి. మరి ఆ ప్రత్యేకత ఏమిటో తెలియాలంటే మాత్రం జనవరి 13 సాయంత్రం 4 గంటల వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జనవరి 24న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Leave a comment