Moviesసరిలేరు నీకెవ్వరు ఎక్స్‌క్లూజివ్ ప్రీ-రివ్యూ

సరిలేరు నీకెవ్వరు ఎక్స్‌క్లూజివ్ ప్రీ-రివ్యూ

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సరిలేరు నీకెవ్వరు మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి వచ్చేస్తుంది. మొదట్నుండీ ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ కాగా ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఆ అంచనాలను మరింత పెంచేశాయి. ఈ సినిమాకు స్పెషల్ స్క్రీనింగ్ కొద్దిసేపటి క్రితం వేశారు. ఈ సినిమా చూసిన కొందరు మీడియావారు చెప్పిన వివరాల ప్రకారం ఈ సినిమా మహేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవనున్నట్లు తెలుస్తోంది.

కథ(ఇలా ఉండొచ్చు):
ఆర్మీ మేజర్ అయిన కృష్ణ(మహేష్ బాబు) కొన్ని కారణాల వల్ల ఆర్మీ నుండి రాయలసీమ ప్రాంతానికి వస్తాడు. అక్కడ ఫ్యాక్షన్ కక్ష్యలతో కొట్టుకుంటున్న రెండు వర్గాలను చూసి కృష్ణ ఆగ్రహంతో ఊగిపోతాడు. ఈ క్రమంలో విలన్ ప్రకాష్ రాజ్ చేసిన ఓ మర్డర్‌కు సంబంధించి శవానికి పోస్టుమార్టంలో ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూస్తాడు. కానీ తన ప్రొఫెషన్‌లో సిన్సియర్ అయిన డాక్టర్ భారతి(విజయశాంతి) అందుకు ఒప్పుకోదు. దీంతో ఎలాగైనా ఆ కేసు నుంచి బయటపడేందుకు భారతిని భయపెట్టేందుకు ప్రయత్నిస్తాడు ప్రకాష్ రాజ్. ఈ క్రమంలో ఆమె కృష్ణ సాయం కోరుతుంది. ఇక్కడి నుండి విలన్‌ పని పట్టేందుకు కృష్ణ ఏం చేశాడనేది సినిమా కథ అని తెలుస్తోంది.

విశ్లేషణ(అందిన వివరాల ప్రకారం):
సరిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్ మొదట్నుండీ చెప్పినట్లుగానే ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ మహేష్ మేనియాతో నిండిపోయింది. ఈ సినిమా చూస్తున్నంతసేపు మనకు తెరపై మహేష్ బాబు మాత్రమే కనిపిస్తాడు. అంతలా మహేష్ మాయ చేసి పారేశాడు. ఆర్మీ మేజర్ పాత్రలో, విజయశాంతికి సాయం చేసే పాత్రలో వేరియేషన్స్ బాగా చూపించాడు మహేష్.

ఇక యాక్షన్ సీక్వెన్స్‌లలో మహేష్ రెచ్చిపోయాడని తెలుస్తోంది. అటు సినిమాకే హైలైట్ అంటోన్న 30 నిమిషాల ట్రైయిన్ సీన్‌లో మహేష్ కామెడీ టైమింగ్‌తో జనాలను కడుపుబ్బా నవ్వించాడు. బండ్ల గణేష్ గ్యాంగ్, రష్మిక మందన్న గ్యాంగ్‌లు చేసే రచ్చ మామూలుగా ఉండదు. సెకండాఫ్‌లో వెన్నెల కిషోర్, సుబ్బరాజుల కామెడీ కూడా పీక్స్.

చిత్ర ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ మాత్రం ఎవ్వరి ఊహలకు అందని విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా ఒకలా ముగుస్తుందని అందరూ అనుకుంటే పెద్ద ట్విస్టుతో వేరేలా ముగించేశాడట దర్శకుడు అనిల్ రావిపూడి. మొత్తానికి సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి బరిలో ఫస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అని చూసినవారు అంటున్నారు.

చివరగా:
ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉంది. చాలా మంది నటీనటులు మనకు ఈ సినిమాలో కనిపిస్తారు. వారందరి నటన ఎలా ఉందో, ఎవరు ఏ విధంగా మెప్పించారో సినిమా చూసిన తరువాత తెలుపుతాం. ఇక టెక్నికల్ విభాగం పరంగా దేవిశ్రీ పాటలు బాగానే ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మైండ్ బ్లాక్, డ్యాంగ్ డ్యాంగ్ అనే పాటలు చాలా బాగున్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడంటూ పలువురు ఇప్పటికే ఆయనకు కితాబిస్తున్నారు.

గమనిక: ఈ సినిమాను ప్రత్యక్షంగా చూసిన తరువాతే Telugulives.com ఈ సినిమాకు రేటింగ్‌‌ను ఇస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news