ప్రభాస్‌ను డెవిల్‌గా మారుస్తున్న రెడ్డి

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ సాహో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొన్ని సరికొత్త రికార్డులు సృష్టించాడు. కాగా ప్రభాస్ ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో తన నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫోకస్ చేశాడు.

ప్రస్తుతం జాన్ అనే సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్న ప్రభాస్ ఆ తరువాత అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడట. బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్ కపూర్ కోసం సందీప్ రాసుకున్న కథకు డెవిల్ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశాడట. అయితే రణ్‌బీర్ కపూర్ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడట. దీంతో సందీప్ రెడ్డి ఈ కథను ప్రభాస్‌కు వినిపించగా, అతడు ఓకే చెప్పాడట.

దీంతో ఈ కాంబో అతిత్వరలో సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా రెడీ అవుతున్నారు. ఈ కాంబోతో రాబోయే సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Leave a comment