యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమా అప్పట్లో ఎలాంటి బ్లాక్బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో తారక్ ఎంతో వెయిట్ చేసిన సక్సెస్ను మరోసారి తన ఖాతాలో వేసుకున్నాడు. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.
అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిన 12 ఏళ తరువాత మళ్లీ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్. అయితే యమదొంగ సినిమాను ఈసారి తెలుగులో కాకుండా తమిళంలో రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్. తమిళనాట తారక్, రాజమౌళిలకు మంచి ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆర్ఆర్ఆర్పై అంచనాలను మరింత పెంచేందుకే ఈ సినిమాను ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారట చిత్ర యూనిట్.
మరి 12 ఏళ్ల తరువాత జనవరి 3న తమిళంలో రిలీజ్ అవుతున్న యమదొంగ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. తమిళ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారా లేదా అనేది జనవరి 3న తేలిపోతుంది. ఏదేమైనా ఈ సినిమాను ఇప్పుడు రిలీజ్ చేయడం ఒక రిస్కే అని చెప్పాలి.