Gossipsబాలయ్య ఫ్యాన్స్‌ను బెంబేలెత్తిస్తున్న నిర్మాత

బాలయ్య ఫ్యాన్స్‌ను బెంబేలెత్తిస్తున్న నిర్మాత

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం రూలర్ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న నందమూరి ఫ్యాన్స్‌కు నిరాశ మిగిల్చారు రూలర్ చిత్ర దర్శకనిర్మాతలు. రొటీన్ కథతో ప్రేక్షకులకు చుక్కలు చూపించిన ఈ సినిమా దర్శకనిర్మాతలు మరోసారి బాలయ్య అభిమానులను ఇబ్బంది పెట్టేందుకు రెడీ అవుతున్నారు.

బాలయ్యతో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు నిర్మాత సి.కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ మరో విశేషమేమిటంటే ఈ సినిమాకు దర్శకత్వం కూడా జైసింహా, రూలర్ చిత్రాల దర్శకుడు కెఎస్ రవికుమార్ అని చెప్పాడు కళ్యాణ్. రూలర్ చిత్రంలో బాలయ్య పర్ఫార్మెన్స్‌కు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన సి.కళ్యాణ్, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అంతేగాక బాలయ్య కూడా ఈ కాంబోను మరోసారి రిపీట్ చేసేందుకు సై అన్నాడని తెలుస్తోంది. ఇప్పటికే రెండు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్స్‌ను ఎదుర్కొన్న బాలయ్య, మరోసారి కళ్యాణ్, రవికుమార్ కాంబినేషన్‌లో సినిమా చేసి మళ్లీ చేతులు కాల్చుకుంటాడా అని ఆయన అభిమానులు భయపడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news