రానా వల్లో పడ్డ మరో స్టార్ హీరోయిన్..!

దగ్గుబాటి రానా ఎంత టాలెంట్ ఉన్న నటుడో.. అదే రేంజ్ లో రొమాంటిక్ గాయ్ అని తెలుస్తుంది. ఇది అందరు అనే మాటే.. ఇందులో మనం సృష్టించింది ఏది లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన సౌత్ క్రేజీ క్వీన్ తో రానా డేటింగ్ అప్పట్లో హాట్ న్యూస్ గా మారింది. మొన్నీమధ్య ఇంటర్వ్యూస్ లో కూడా రానా ఆమెతో ఉన్న రిలేషన్ గురించి కూడా చెప్పిన ఆన్సర్ వైరల్ గా మారింది. ఇదిలాఉంటే ఇప్పుడు రానా వల్లో మరో స్టార్ హీరోయిన్ పడ్డదని తెలుస్తుంది.

అది ఎవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్. రానాతో రకుల్ డేటింగ్ లో ఉదన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే విషయాన్ని రకుల్ తో చెబితే తాను ఎవరితో డేటింగ్ లో లేను.. రానా తనకు మంచి స్నేహితుడు మాత్రమే అంటుంది. మంచు లక్ష్మి, రానా, తనది ఓ గ్యాంగ్ అని అందులో ఇంకా చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారని అంటుంది రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న తనకు డేటింగ్ చేసే తీరిక లేదని అంటుంది.

ప్రస్తుతం తన స్టేటస్ సింగిల్ గానే ఉందని.. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే కచ్చితంగా తన ఫ్యాన్స్ తో పంచుకుంటా అని అంటుంది రకుల్. తనకు రానాతో లింక్ పెట్టి రాస్తున్న వార్తలు తనని ఇబ్బంది పెడుతున్నాయని రానా తనకు మంచి ఫ్రెండ్ మాత్రమే ఇక మీదట అలాంటి వార్తలు రాయొద్దని రిక్వెస్ట్ చేస్తుంది రకుల్.

Leave a comment