మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం గాంధీ జయంతి సందర్భంగా నేడు ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. అయితే యూఎస్ లో ప్రిమియర్ షోలు కూడా పూర్తయ్యాయి. అయితే యూఎస్‌లో ప్రిమియర్ షోలు చూసిన ప్రేక్షకులు సైరా మూవీపై ట్విట్టర్‌లో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇప్పుడు యూఎస్ ప్రేక్షకులు ఇచ్చిన రివ్యూలు చూస్తే సైరా సినిమాపై షాకింగ్ నిజాలు తెలుస్తున్నాయి..
సినిమాను దర్శకుడు సురేందర్‌రెడ్డి ఎంతో నైపుణ్యంతో డ్రామా, దేశభక్తి, ఎమోషన్ ఎలా అన్ని అంశాలని సురేందర్ రెడ్డి అద్భుతంగా గ్రైండర్‌లో వేసి మిక్స్ చేస్తే వచ్చే ఓ అద్భుతమే ఈ సైరా సినిమా అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ ని బిల్డ్ అప్ చేసిన విధానం, ప్రీ ఇంటర్వెల్ సన్నివేశం బావున్నాయి. సెకండ్ హాఫ్ లో ఐదు సీన్లు సీరియస్‌గా సాగే సన్నివేశాలు ఉన్నాయి. క్లైమాక్స్ సన్నివేశాన్ని చిరు తన నటనతో మరోస్థాయికి తీసుకెళ్లాడు.
సైరా ఒక రత్నం లాంటి సినిమా. సైరా అద్భుతమైన చిత్రం.. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి తన పాత్రలో అదరగొట్టారు. చిత్రంలో మిగిలిన పాత్రలు కూడా అద్భుతంగా ఉన్నాయి. సైరా హిట్టు బొమ్మ అంటూ మరో నెటిజన్ ట్విట్టర్‌లో కామెంట్ పోస్టు చేసారు. సైరా చిత్రం చూశాక 19వ శతాబ్దంలో నేనెందుకు పుట్టలేదా అనిపించింది. నాకు కూడా ఆ వీరులతో కలసి స్వాతంత్రం కోసం పోరాటం చేయాలనిపించేంత రేంజ్‌లో సినిమాను తెరకెక్కించారు దర్శకుడు.. అంతే స్ఫూర్తి నింపేలా నటించాడట మెగాస్టార్. ప్రీ ఇంటర్వెల్ 30 నిమిషాలు కుమ్మేశారు. ఫస్ట్ 40 మాత్రం సినిమా స్లోగా ఉంది. కానీ ఆ తర్వాత బాస్ మాస్ అడియెన్స్ అదిరిపోయే సన్నివేశాలతో చిత్రం హైలెట్‌గా నిలుస్తుందని ట్విట్టర్ లో ప్రేక్షకులు చెపుతున్నారు..