ఓ పోరాట యోధుడి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం సైరా. మెగాస్టార్ చిరంజీవి కేరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కిన ఈచిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో ఈ సినిమాకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు బయటికి లీక్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు సైరా చిత్రం ఫ్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే కళ్ళు తేలేయాల్సిందే…
మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్‌లో స్టార్‌డమ్ ఆయన సొంతం. ఇక బాలీవుడ్ లో ఆయనకు ఇమేజ్ బాగానే ఉంది. దీనికి తోడు సైరాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఉండనే ఉన్నారు. దీనికి తోడు సినిమా నిర్మాత మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కు బాలీవుడ్‌లో క్రేజ్ ఉంది. ఇంత మందికి బాలీవుడ్లో ఉన్న ఇమేజ్‌కు తోడు సినిమాను బాలీవుడ్ హీరో ఫరాన్ ఆక్తర్ విడుదల చేస్తుండటంతో సైరాకు హింది బెల్ట్‌లో కూడా తిరుగులేదనే చెప్పవచ్చు.
ఇక ఈ సినిమాకు దాదాపుగా రూ.300కోట్ల బడ్జెట్ అయిందనే టాక్ ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా దాదాపుగా రూ.150కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. బాహుబలి, సాహో సినిమాల తరువాత ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది. అయితే బిజినెస్ ఏరియాల వారిగా ఉలా ఉంది. ఎన్.ఆర్.ఏ (నాన్ రిఫండబుల్) బేసిస్ బిజినెస్ వివరాలు ఏరియా వైజ్ పరిశీలిస్తే… నైజాం 30 కోట్లు.. సీడెడ్ 20కోట్లు.. ఉత్తరాంధ్ర-14.40కోట్లు.. నెల్లూరు 4.80కోట్లు.. కృష్ణా 9 కోట్లు.. గుంటూరు 11.50 కోట్లు.. ఈస్ట్ గోదావరి 9.80కోట్లు.. పశ్చిమ గోదావరి 8.40కోట్లు.. మొత్తం ఆంధ్రా తెలంగాణా 107.90 కోట్ల మేర (ఎన్.ఆర్.ఏ) బిజినెస్ సాగింది. ఇక కర్ణాటక 27కోట్లు (ఔట్ రైట్).. తమిళనాడు -కేరళ -ఉత్తర భారతదేశంలో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ సొంతంగా రిలీజ్ చేస్తోంది. విదేశాల్లో 18కోట్ల బిజినెస్ తో, ప్రపంచ వ్యాప్తంగా రూ. 152.90 కోట్ల మేర బిజినెస్ సాగింది.