సైరా అంత కొంప ముంచిందా..?

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ లెక్కను తారుమారు చేసింది. ఇక ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఓవర్సీస్‌లోనూ ఆడియెన్స్ చాలా ఆతృతగా చూశారు. రిలీజ్ తరువాత ఈ సినిమాకు అక్కడ మిశ్రమ స్పందన వచ్చింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల పరంగా ఈ సినిమా దుమ్ములేపింది.

కానీ ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బయ్యర్లకు చుక్కలు చూపిస్తోంది. ఇప్పటివరకు సైరా సినిమా ఏకంగా 2.2 మిలయన్ డాలర్లు వసూలు చేసింది. కానీ ఈ సినిమా అక్కడి బయ్యర్‌కు పెద్ద లాస్ మిగిల్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సైరా సినిమాను ఓవర్సీస్ బయ్యర్ ఏకంగా 3.3 మిలయన్ డాలర్లకు కొన్నాడు. కానీ ఇప్పటివరకు ఆ సినిమా కేవలం 2.2 మిలయన్ డాలర్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో ఈ సినిమా టోటల్ రన్‌లో కూడా ఆ మొత్తాన్ని రికవర్ చేసేలా లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

దీంతో సైరా ఓవర్సీస్ బయ్యర్‌ నిండా మునిగేందుకు సిద్ధం అయ్యాడు. ఏకంగా మిలియన్ డాలర్ల లాస్ రావడం అంటే మామూలు విషయం కాదు. మరి ఇంత పెద్ద లాస్ నుండి బయ్యర్‌ను బయటపడేసేందుకు చిత్ర యూనిట్ ఏం చేస్తుందో చూడాలి. ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన విషయం తెలిసిందే.

Leave a comment