సైరా క్లోజింగ్ కలెక్షన్స్.. నష్టం తప్పలేదు

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రెస్టీజియస్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సైరా కలెక్షన్ల పరంగా కూడా కొన్ని రికార్డులు క్రియేట్ చేసింది.

అయితే పూర్తి రన్ ముగిసే సరికి ఈ సినిమాకు నష్టాలు తప్పలేదు. 73 శాతం పెట్టుబడిని రాబట్టి అబోవ్ యావరేజ్ సినిమాగా నిలిచింది. సైరా ప్రపంచవ్యాప్తంగా క్లోజింగ్ రన్‌లో రూ.145.79 కోట్లు వసూలు చేసింది. నయనతార, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ లాంటి నటులు ఈ సినిమాలో నటించినా కలెక్షన్ల పరంగా సినిమా నిరాశపరిచింది. ఏరియాల వారీగా ఈ చిత్ర క్లోజింగ్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – క్లోజింగ్ కలెక్షన్లు
నైజాం – 32.76 కోట్లు
సీడెడ్ – 19.35 కోట్లు
నెల్లూరు – 4.62 కోట్లు
కృష్ణా – 7.53 కోట్లు
గుంటూరు – 9.63 కోట్లు
వైజాగ్ – 16.62 కోట్లు
తూ.గో – 9.21 కోట్లు
ప.గో – 6.61 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 106.39 కోట్లు
కర్ణాటక – 16.85 కోట్లు
తమిళనాడు – 2.70 కోట్లు
కేరళ – 0.90 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 5.50 కోట్లు
ఉత్తర అమెరికా – 9.28 కోట్లు
గల్ఫ్ – 1.66 కోట్లు
ఆస్ట్రేలియా + న్యూజీలాండ్ – 0.95 కోట్లు
యూకే+మలేషియా – 0.36 కోట్లు
రెస్టాఫ్ వరల్డ్ – 1.20 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 145.79 కోట్లు

Leave a comment