ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేసింది. బాహుబలి వంటి వండర్‌ను క్రియేట్ చేసిన దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో ప్రెస్టీజియస్ మూవీ RRR కోసం యావత్ ఇండస్ట్రీ ఆసక్తిగా చూస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతోందనే విషయం తప్పితే అందులో హీరోలు ఎలా ఉంటారనే విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. దీంతో చిత్ర యూనిట్ అందరికీ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీం పాత్రల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే తెలిపింది. కాగా అక్టోబర్ 22న కొమురం భీం జయంతి కావడంతో ఈ సినిమాలో తారక్ పాత్రను రివీల్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో తారక్ లుక్ మాత్రం మామూలుగా ఉండదట. ఇక ఈ పోస్టర్ విడుదలతో ఇండస్ట్రీ షేక్ కావడం ఖాయమని తెలుస్తోంది.
మరి ఎంతగానో ఆసక్తిని రేకెత్తించే ఈ సినిమాలో తారక్ పాత్ర ఎలా ఉండబోతుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. తారక్ ఫస్ట్ లుక్ పోస్టర్‌పై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలు జరగడం విశేషం. మరి దుమ్ములేపే తారక్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా ఉండబోతుందో చూడాలంటే ఇంకాస్త సమయం ఆగాల్సిందే.