డ్యుయెల్ ఛాలెంజ్‌లో ఇస్మార్ట్ హీరో

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇటీవల ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. చాలా కాలం తరువాత సక్సెస్ అందుకోవడంతో మనోడు ఇంకా ఆ సంతోషం నుండి బయట పడలేదు. కాగా ఇప్పుడు తన నెక్ట్స్ మూవీని మరింత ఛాలెంజింగ్‌గా తీసుకున్నాడు ఈ హీరో.

ఇస్మార్ట్ శంకర్‌లో డ్యుయెల్ మెమరీ కాన్సెప్ట్‌తో రామ్ యాక్టింగ్ అదరగొట్టాడు. దీంతో ఇప్పుడు ఏకంగా డ్యుయెల్ రోల్ పాత్రలో రామ్ నటించేందుకు రెడీ అవుతున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తడం’ అనే క్రైమ్ డ్రామా మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ డ్యుయెల్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటివరకు రామ్ పోతినేని డ్యుయెల్ రోల్ చేయలేదు. దీంతో ఈ హీరో తొలిసారి డ్యుయెల్ రోల్‌ చేసేందుకు రెడీ అయ్యాడు.

నేను శైలజ ఫేం కిషోర్ తిరుమల ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా నివేథా పేతురాజ్ మరియు మాళవిక శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి ఈ సినిమాలో రామ్ డ్యుయెల్ రోల్‌లో ఎలా ఇరగదీస్తాడో చూడాలి.

Leave a comment