‘ సైరా ‘ బిజినెస్‌పై చిరు స‌తీమ‌ణి సురేఖ కామెంట్‌

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా థియేట‌ర్లోకి వ‌చ్చేందుకు మ‌రికొన్ని గంట‌ల టైం మాత్ర‌మే ఉంది. ఇక ఈ సినిమా ఎలా ఉంటుంది ? ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి సైరాను ఎలా ? డీల్ చేశాడు. సైరాలో ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి పాత్ర‌లో చిరు ఎలా ? న‌టించాడు ? అన్న దానిపై ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు.

ఈ సినిమా కోసం చిరు ఏకంగా రెండు సంవ‌త్స‌రాల పాటు క‌ష్ట‌ప‌డ్డాడు. చిరు ఈ వ‌య‌స్సులో కూడా ఎన్నో సాహ‌సాలు చేశాడు. ఇక ఓ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడి పాత్ర‌లో చిరు న‌టిస్తుండ‌డంతో స‌హ‌జంగానే ప్రతి ఒక్క‌రికి చిరు ఎలా ? న‌టించాడా ? అన్న ఆస‌క్తి ఉంది. ఈ క్ర‌మంల‌నే చిరు త‌న తాజా ఇంట‌ర్వ్యూలో ఈ సినిమాపై త‌న భార్య సురేఖ చేసిన కామెంట్ గురించి చెప్పాడు. సోమ‌వారం ఉద‌య‌మే చిరు స‌తీమ‌ణి సురేఖ సైరా గురించి మాట్లాడార‌ట‌.

చిరు, సురేఖ మ‌ధ్య సైరా ముచ్చ‌ట్లు న‌డుస్తున్న‌ప్పుడు సైరా సినిమాను కొన్ని చోట్ల సొంతంగా రిలీజ్‌ చేస్తున్నాం… కొన్ని చోట్ల మంచి బిజినెస్‌ అయింద‌న్న టాపిక్ రాగా… అందుకు సురేఖ స్పందిస్తూ మనం డబ్బుల గురించి చూడకూడదు. డబ్బు వస్తుందో రాదో తెలియదు కానీ లైఫ్‌ టైమ్‌లో మీకు గొప్ప పాత్ర ఇది. ఆ తృప్తిని డబ్బుతో కొలవలేం. మీ కోరిక తీర్చాలని రామ్‌ చరణ్‌ ఈ సినిమా చేశాడు. ఆ విధంగా వాడు సంతృప్తిగా ఉంటాడు. గొప్ప పాత్ర చేశాను అనే మీ కోరిక నెరవేరింది. నేను మీతో సినిమా చేయాలనే నా కోరిక నెరవేరింది (సురేఖ సమర్పణలో ‘సైరా’ రూపొందింది) అని చెప్పింద‌ట‌. అలా సైరా విష‌యంలో సురేఖ కూడా చాలా హ్యాపీగా ఉంద‌ని చిరు తెలిపారు.

Leave a comment