మెగాస్టార్‌కు మళ్లీ బయటి వాయింపుడే!

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను అత్యంత ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించిన విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహిరించిన ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇకపోతే ఇప్పుడు అందరి దృష్టి మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంపై పడింది.

ఇప్పటికే ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సినిమాకు సంగీతం ఎవరు అందిస్తారనే విషయంపై ఓ క్లారిటీ వచ్చింది. ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకులు అజయ్ మరియు అతుల్ మ్యూజిక్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా కొరటాల తన సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్‌తో మాత్రమే మ్యూజిక్ ఇప్పించుకుంటాడు. కానీ ఇప్పుడు పంతా మార్చి బాలీవుడ్ సంగీత దర్శకులను పట్టుకువస్తున్నాడు.

అయితే ఈ విషయంపై ఇంకా అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా మెగాస్టార్ సైరా సినిమాకు కూడా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఉండటం.. ఇప్పుడు ఆయన నెక్ట్స్ మూవీకి కూడా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఉండటంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ విషయం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.

Leave a comment