Gossipsబాలయ్యతో రిస్క్ చేస్తున్న మెగా హీరో

బాలయ్యతో రిస్క్ చేస్తున్న మెగా హీరో

సాధారణంగా హీరోల సినిమాలు పండగ సీజన్‌లో పోటీ పడటం మనం చూస్తుంటాం. తమ హీరో గెలుస్తాడంటే లేదు తమ హీరో గెలుస్తాడని వాదిస్తుంటారు. ఇక స్టార్ హీరోలతో పోటీ పడేందుకే జంకుతారు కొందరు చిన్న హీరోలు. కానీ ఇప్పుడు ఓ యంగ్ హీరో ఏకంగా బాలయ్యతో పోటీ పడేందుకు రెడీ అయ్యాడు.

నందమూరి బాలయ్య నటిస్తోన్న 105వ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. అయితే ఈ సినిమాకు పోటీగా ఏ సినిమాలు రాకపోయినా ఇప్పుడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బాలయ్యకు పోటీగా బరిలో దిగుతున్నాడు. బాలయ్య రూలర్‌గా తన సినిమాతో సంక్రాంతి సందడి చేయాలని చూస్తుండగానే.. సాయి ధరమ్ తేజ్ ప్రతి రోజు పండగేను కూడా సంక్రాంతి బరిలో దింపుతున్నాడు.

మరి ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఏ విధంగా ఉంటుందో తెలియాలంటే అవి రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. ఇక సంక్రాంతి బరిలో ఏ పందెం కోడి గెలుస్తుందా అని సినీ జనం అప్పుడే అంచనాలు వేసుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news