ఒక్క యాక్షన్ సీన్‌కు 40 కోట్లు

ప్రముఖ తమిళ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న ప్రెస్టీజియస్ మూవీ ‘ఇండియన్ 2’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా కోసం తమిళ తంబీలతో పాటు తెలుగు ఆడియెన్స్ కూడా చాలా ఆసక్తిగా చూస్తు్న్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వారు ఎదురుచూస్తున్నారు.

గతంలో వచ్చిన భారతీయుడు సినిమా ఎలాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ సీక్వెల్ సినిమాలోనూ కమల్ హాసన్ అదే ముసలి గెటప్‌లో మనకు కనిపిస్తాడు. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న చిత్ర యూనిట్ ఇందులో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేశారు. దీనికోసం ఏకంగా రూ.40 కోట్ల ఖర్చు చేయనుందట చిత్ర యూనిట్. ఈ యాక్షన్ సీన్‌లో ఏకంగా 2000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉంటారట.

లైకా ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. సిద్దార్ధ మరియు రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 2020 సంవత్సం చివర్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Leave a comment