పవన్ కి షాక్ ఇచ్చిన సాక్షి మీడియా..?

నిన్న హైదరాబాద్ ఎల్ బీ స్టేడియంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ రిలీజ్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాన్, రాజమౌళి, వివివినాయక్, అల్లు అరవింద్ మరికొంత మంది అగ్రతారలు, టెక్నీషియన్స్ హాజరయ్యారు. అయితే ఈవెంట్ లైవ్ టెలికాస్ట్ హక్కులు సాక్షి దక్కించుకుంది. సాధారణంగా ఏ దైనా ఫంక్షన్ కి పవన్ కళ్యాన్ హాజరైతే ఆ ఫంక్షన్ లో ఆయన మాట్లాడే మాటలపై ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. బ్రేక్స్ పక్కనపెట్టి మరీ పవన్ కళ్యాణ్ స్పీచ్ నిరంతరాయంగా అందిస్తూ ఉంటాయి టీవీ చానల్స్. కానీ సరిగ్గా పవన్ కళ్యాణ్ స్పీచ్ సమయంలో సాక్షి బ్రేక్ ఇవ్వడం ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

అసలు విషయానికి వస్తే..ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షంపై పవన్ కళ్యాన్ ఓ రేంజ్ లో ఉతికి ఆరేశారు. దాంతో నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ మాట్లాడే సమయంలో లైవ్ కాస్ట్ లో ఏదైనా డిస్టబ్ చేస్తుందా? ఇదే విషయంపై అభిమానులకు అనుమానాలు వచ్చాయి. గత రెండేళ్లుగా పవన్ కళ్యాణ్ వార్తల విషయంలో సాక్షి వ్యవహరిస్తున్న తీరు దీనికి కారణం. గతంలో అరవింద సమేత సినిమా లాంచ్ కి పవన్ కళ్యాణ్ హాజరైనప్పుడు సాక్షి సినిమా పేజీ లో సైతం పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండా సాక్షి వార్త ని ఇచ్చిన తీరు అప్పట్లో పాఠకులని ఆశ్చర్య పరిచింది. అయితే పవన్ కళ్యాణ్ ఉపన్యాసం ఈ విధంగా కొనసాగుతూ ఉండగా, సాక్షి పవన్ కళ్యాణ్ స్పీచ్ కు బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ తర్వాత పవన్ కళ్యాణ్ స్పీచ్ కొనసాగించకుండా, ఆ తర్వాత మాట్లాడిన చిరంజీవి స్పీచ్ తో మొదలెట్టింది.

కాగా, సాక్షి కట్ చేసిన ఆ కాసేపట్లో.. ఒక అభిమాని స్టేజీ మీదకు దూసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకున్నాడు. సెక్యూరిటీ అతన్ని పక్కకు జరిపే లోపు పవన్ వారిని వారించి ఆ అభిమానిని హత్తుకున్నాడు. పేరుకి లైవ్ అయినప్పటికీ , స్టేజి మీద జరుగుతున్న దానికి, టీవీ లో టెలికాస్ట్ అవుతున్న దానికి మధ్యలో ఒక ఐదు నిమిషాల లోపు ల్యాగ్ ఉంటుంది కాబట్టి, సాక్షి ఉద్దేశ పూర్వకంగానే ఆ ఇన్సిడెంట్ కట్ చేసి ఉండవచ్చని చూసిన ప్రేక్షకులు భావిస్తున్నారు.

Leave a comment