యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో వచ్చిన సినిమా సాహో. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ ఈ సినిమా నిర్మించారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. నైజాం లో మొదట్లో దూఉకుడు కనిపించిన సాహో రెండు వారాలకు 27 కోట్ల దగ్గర ఆగిపోయింది.
వరల్డ్ వైడ్ గా సాహో 204.72 కోట్ల దాకా రాబట్టింది. ఓవర్సీస్ లో 29.50 కోట్లు వసూళు చేసింది. సాహో సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో 79.17 కోట్లు రాబట్టింది. నార్త్ ఇండియాలో సాహో మంచి వసూళ్లు రాబడుతుంది. 73.80 కోట్ల షేర్ తో దూసుకెళ్తుంది సాహో. బాహుబలి తర్వాత ప్రభస చేసిన ఈ సినిమా హింది వర్షన్ సేఫ్ అయినట్టే కాని మిగతా బాషల్లో లాసులు తెచ్చేలా ఉంది.
ఏరియా వైజ్ సాహో 12 రోజుల కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తే..
నైజాం : 27.79 కోట్లు
సీడెడ్ : 11.66 కోట్లు
వైజాగ్ : 9.82 కోట్లు
గుంటూరు : 7.87 కోట్లు
ఈస్ట్ : 7.24 కోట్లు
వెస్ట్ : 5.59 కోట్లు
కృష్ణ : 5.03 కోట్లు
నెల్లూరు : 4.24 కోట్లు
ఏపి/తెలంగాణ : 79.17 కోట్లు
కర్ణాటక : 15.80 కోట్లు
తమిళనాడు : 5.10 కోట్లు
కేరళ : 1.35 కోట్లు
నార్త్ ఇండియా : 73.80 కోట్లు
రెస్ట్ ఆఫ్ వరల్డ్ : 29.50 కోట్లు
వరల్డ్ వైడ్ : 204.72 కోట్లు