భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అసువులు బాసిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణ వ్యయం ఎంతో ఇప్పుడు తెలిసిపోయింది. ఇప్పటి వరకు కేవలం ఊహగానాలతోనే ఇంత భారీ ఖర్చు.. అంత భారీ ఖర్చు అని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన బడ్జెట్ ఇప్పుడు అందరికి తెలిసేలా చిత్ర దర్శకుడు సురేందర్‌రెడ్డి చెప్పెసాడు..
సైరా చిత్రం ప్రారంభించినప్పుడు కేవలం రూ.200కోట్ల బడ్జెట్ అనుకున్నారట.. కానీ సినిమా నిర్మాణంకు రెండేళ్ళు పట్టింది. దీంతో సినిమా వ్యయం అప్పటికి ఇప్పటికి రేట్లు పెరగడంతో బడ్జెట్ పెరిగిందట. దీనికి తోడు సినిమాకు మధ్యలో ఆటంకాలు రావడం, సెట్స్ కాలిపోవడంతో కూడా నిర్మాణ వ్యయం మరింత పెరిగిందనేటి దర్శకుడి మాట. అందుకే సినిమా రూ.270కోట్ల వరకు బడ్జెట్ అయిందట. ఇంత వ్యయం చేసి తీస్తున్న ఈసినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్‌తోనే లాభాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తుంది.
సైరా సినిమా హీరో మెగాస్టార్‌కు ఉన్న ఇమేజ్దృష్ట్యా సైరా బిజినెస్ భారీగానే జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. థియోట్రికల్ రైట్స్‌ను సుమారు రూ.200కోట్ల వరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తుంది. ఇక ఇటీవలే డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్‌కు రూ.40కోట్లకు అమ్మారని, ఇక శాటిలైట్ హక్కులను రూ.60కోట్ల వరకు అమ్మితే నాన్ థియోట్రికల్ హక్కుల రూపంలోనే రూ.100కోట్లు సమకూరనున్నాయి. అంటే సినిమా దాదాపు రూ.300కోట్ల బిజినెస్ చేసినట్లే లెక్క.. సో సైరా బిజినెస్ తో పెట్టిన పెట్టుబడి తీరిపోతుంది…