వామ్మో అఖిల్‌కు హీరోయిన్ దొరికేసిందోచ్‌

అక్కినేని నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇప్పటికే వరుసగా ఫ్లాపులు ఇస్తూ ఉన్నాడు. తొలి మూడు సినిమాలు అఖిల్ – హలో – మిస్టర్ మజ్ను డిజాస్టర్ కావడంతో నాలుగో సినిమాతో ఆయన హీరోగా ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించాడు. బొమ్మ‌రిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ కొత్త సినిమా ఎప్పుడో ఏడెనిమిది నెలల క్రితమే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో అఖిల్ పక్కన నటించే హీరోయిన్ ఫైనల్ కాకపోవడంతో ఈ సినిమా షూటింగ్ ఏడు ఎనిమిది నెలలుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది.

గీతా ఆర్ట్స్‌2 బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను హీరోయిన్‌ ఎవరన్నది ఫైనల్‌ కాకుండానే చాలా వరకు షూటింగ్ పూర్తి చేశారు. ఏడెనిమిది నెల‌లుగా హీరోయిన్ లేక చిత్ర యూనిట్ ఎన్నో ఇబ్బందులు ప‌డుతోంది. అఖిల్ కోసం కియారా అద్వానీ, రష్మిక మందన్న ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది పేర్లు వినిపించినా ఫైనల్‌గా చిత్రయూనిట్ పూజా హెగ్డేను ఫైనల్ చేశారు.

అఖిల్‌కు జోడి పూజానే అని కన్ఫామ్ చేస్తూ ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. దీంతో ఎట్ట‌కేల‌కు ఏడు నెల‌ల సుదీర్ఘ నిరీక్ష‌ణ అనంత‌రం పూజ‌ను హీరోయిన్‌గా సెట్ చేసిన‌ట్ల‌య్యింది. పూజా హెగ్డే ప్రస్తుతం.. అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో’ సినిమాతో పాటు ప్రభాస్‌ నెక్ట్స్ సినిమా జాన్‌లో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Leave a comment