టాలీవుడ్ ట్ర‌యాంగిల్ ఫైట్‌లో విన్న‌ర్ ఎవ‌రో….

ప్రస్తుతం థియేటర్లలో ఇస్మార్ట్ శంకర్, డియర్ కామ్రేడ్ సినిమాలు మాత్రమే మిగిలాయి. గ‌త కొన్ని వారాలుగా ప్రతి శుక్ర‌వారం ఏదో ఒక సినిమా హిట్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ వారాంతం మరో 3 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. రామ్, విజయ్ దేవరకొండ సినిమాలకు అవి ఏ స్థాయిలో పోటీనిస్తాయో చూడాలి. వరుసగా ఫ్లాపులు అందుకుంటున్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాక్ష‌సుడుతో వ‌స్తున్నాడు. ఈ సినిమా విజయంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు.

భారీ బ‌డ్జెట్ సినిమాల త‌ర్వాత లో బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా కోలీవుడ్‌లో హిట్ అవ్వ‌డంతో ఇక్క‌డ కూడా మంచి అంచ‌నాలే ఉన్నాయి. విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ అందుకున్నారు. ఈ సినిమా హిట్ అయితే బెల్లంకొండ కెరీర్ ట్రాక్ ఎక్కుతుంది. ఇక రాక్షసుడికి పోటీగా వస్తోంది గుణ369. కార్తికేయ హీరోగా నటించిన ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. ఆర్ఎక్స్ 100 సినిమాతో హిట్‌కొట్టి హిప్పీతో ప్లాప్ ఇచ్చిన యువ హీరో కార్తీకేయ న‌టిస్తోన్న ఈ సినిమాపై ఓ కన్నేసి ఉంటారు టాలీవుడ్ ప్రేక్షకులు. ఈ సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్లు ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి.

ఈ సినిమా హిట్ అయితేనే కార్తీకేయ‌కు లైఫ్ ఉంటుంది. ఇక ఈ రెండు సినిమాలతో పాటు శివరంజని అనే బి-గ్రేడ్ మూవీ కూడా ఒకటి వస్తోంది. రష్మి గౌతమ్ మెయిన్ లీడ్ గా ఈ సినిమా తెరకెక్కింది. నందుతో పాటు మరికొందరు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. హారర్ ఎలిమెంట్స్ తో పాటు రష్మి అందాలే పెట్టుబడిగా ఈ సినిమా వస్తోంది. మ‌రి ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా జాత‌కం ఏంట‌నేది కొద్ది గంట‌ల్లోనే తేలిపోనుంది.

Leave a comment