జయాపజయాలతో సంబంధం లేకుండా కోలీవుడ్ హీరో విశాల్ సినిమాలు చేస్తుంటాడు. అతడు కోలీవుడ్‌లో చేసే ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. విశాల్‌కు ఇక్కడ ఒకప్పుడు ఉన్నంత మార్కెట్ లేకపోయినా బీ, సీ సెంటర్లలో అతడి సినిమాలు చూసే వాళ్లు ఎక్కువ మందే ఉన్నారు. ఇక గతేడాది తెలుగులో రెండు సినిమాలు ఓ మోస్తరు వసూళ్లు సాధించాయి. మూడేళ్ల క్రితం రాయుడు ఇక గతేడాది అభిమన్యుడు హిట్ అవ్వగా, పందెంకోడి 2 బీ, సీల్లో మంచి వసూళ్లే సాధించింది.
సరే విశాల్ సినిమా తెలుగులో హిట్టు, ప్లాపుతో సంబంధం ఎలా ఉన్నా ఓ మోస్తరు అంచనాలతోనే విడుదల అవుతూ ఉంటుంది. కానీ రేపు శుక్రవారం వస్తోన్న అయోగ్య (తెలుగు ఎన్టీఆర్ టెంపర్ రీమేక్) వస్తున్న సంగతి కనీసం అతని హార్డ్ కొర్ ఫ్యాన్స్ కైనా తెలుసా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అసలు ఈ సినిమా ఇక్కడ ఎన్టీఆర్ నటించిన టెంపర్‌కు రీమేక్.
దీనిని కోలీవుడ్‌లో చేస్తే అక్కడ హిట్ అయ్యింది. విశాల్ – రాశీఖన్నా జంటగా నటించారు. విశాల్ కెరీర్‌లోనే మంచి వసూళ్లు సాధించింది. ఒక్క క్లైమాక్స్ మినహా మిగిలిన సీన్లు అన్ని ఇక్కడ టెంపర్‌కు మక్కీకి మక్కీ దింపేశారు. టెంపర్‌ను ఇప్పటికే మనవాళ్లు టీవీల్లో అరిగిపోయేలా చూశారు. ఇప్పుడు విశాల్ మళ్లీ అదే సినిమా చేసి ఇక్కడ వదిలితే ఎంత వరకు చూస్తారు ? ఈ సినిమా అక్కడ రీమేక్ చేసేటప్పుడే విశాల్ దీనిని తెలుగులో డబ్ చేయమని చెప్పినా మళ్లీ డబ్ చేసి వదులుతున్నారు.
నిజానికి ఈ అయోగ్య గత నెల 12 విడుదల చేస్తున్నామని పోస్టర్లు వదిలారు. ఇప్పుడు మళ్ళీ 9న రిలీజ్ అంటూ బ్యానర్లు కట్టేశారు. అసలే మన్మథుడు 2 రేస్ లో ఉంది. దీంతో పాటు కురుక్షేత్రం త్రీడి – కథనం పోటీ పడుతున్నాయి. ఆ మరుసటి రోజు కొబ్బరి మట్ట వస్తుంది. 9నే అనసూయ కథనం ఉంది. ఇంత పోటీలో అయోగ్య ఎందుకు వస్తుందో ? మరి విశాల్ ఈ టెంపర్ రీమేక్ తెలుగు డబ్బింగ్‌తో ఏం చేస్తాడో ? చూడాలి.