మెగా ఫ్యాన్స్‌కు షాకిస్తున్న చిరు

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ది మోస్ట్ వెయిటెడ్ మూవీ సైరా నరసింహారెడ్డి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని మెగా ఫ్యాన్స్‌ ఆశగా చూస్తున్నారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడికల్ డ్రామాగా వస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుందా అని చూస్తున్న మెగా ఫ్యాన్స్‌ కోసం ఈ సినిమాను అక్టోబర్ 2న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది.

అయితే ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్‌కు మెగాస్టార్ చిరంజీవి షాకివ్వనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 2న రిలీజ్ కావాల్సిన సైరా చిత్రం అనుకున్న సమయానికి రిలీజ్ అయ్యేలా లేదు. సినిమాకు సంబంధించిన ప్రతి విషయం చిరు దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన కంప్యూటర్ గ్రాఫిక్స్ పనులు పూర్తయినా అవి అనుకున్న స్థాయిలో రాలేదని చిరు కంప్యూటర్ గ్రాఫిక్స్ పనిలో రీవర్క్ చేయించాలని చూస్తున్నారు. దీంతో చిత్ర రిలీజ్‌కు మరింత సమయం పడుతుందని చిత్ర యూనిట్ తెలిపింది.

అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్‌ నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఏదేమైనా ఇదే విషయం నిజం అయితే మెగా ఫ్యాన్స్‌కు గట్టి షాక్ తగిలినట్టే.

Leave a comment