యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమా రిలీజ్‌కు మరో 25 రోజుల టైం మాత్రమే ఉంది. ప్రభాస్ సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోయింది. బాహుబలి కోసం ఏకంగా నాలుగేళ్లు కష్టపడ్డ ప్రభాస్ సాహో కోసం రెండేళ్లు కష్టపడ్డాడు. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అభిమానుల అంచనాలు మామూలుగా లేవు. అందుకు తగ్గట్టుగానే ట్రేడ్ వర్గాల్లో బిజినెస్ జరుగుతోంది.
ఇక ఈ సినిమా ఇండియాతో మొదలుకుని ఓవర్సీస్ దాకా ఎంత రాబట్టవచ్చు అన్న దానిపై కూడా ట్రేడ్ వర్గాలు లెక్కులేసుకుంటున్నాయి. ఈ సినిమాకు జరుగుతోన్న బిజినెస్‌తో పాటు బయర్లు పెడుతోన్న రేట్లు కూడా మైండ్ బ్లాక్ అయ్యేలా ఉన్నాయి. సినిమాకు వచ్చిన టాక్‌ను బట్టే వీళ్లంతా సేఫ్ కానున్నారు.
ఇక సాహో తొలి రోజు ఎంత వసూలు చేస్తుందన్న దానిపై నిర్మాతలు భారీగానే ఆశలు పెట్టుకున్నట్టు టాలీవుడ్ ఇన్‌సైడ్ టాక్. ఈ టాక్ ప్రకారం సాహో మొదటి రోజు ఒక్క తెలుగు వెర్షన్ నుంచే రూ. 100 కోట్లు కొల్లగొడుతుందని ఆశిస్తున్నారట. ఇక హిందీ వెర్షన్ దేశవ్యాప్తంగా భారీ ఎత్తున అత్యధిక కేంద్రాల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఓవరాల్‌గా ఫైనల్ బాక్సాఫీస్ రన్ ముగిసే సరికి రూ.500 కోట్ల షేర్ ఆశిస్తున్నారు. అంటే కనీసం రూ. 750 – 800 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది.
సాహోకు అన్ని చోట్లా యునానిమస్‌గా టాక్ వస్తే ఓకే. లేకపోతే చాలా మంది నిండా మునిగిపోతారు. బాహుబలికి ఈ సినిమాకు లింక్ పెట్టి చూడలేం. మరి సాహో సినిమాపై చాలా మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ప్రభాస్ ఏం చేస్తాడో ? చూడాలి.