ఇండియన్ సినిమా హిస్టరీలో బాహుబలి క్రియేట్ చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమా రికార్డులు సినిమాల గురించి పట్టించుకోని వాళ్లకు కూడా సులువుగా గుర్తిండిపోతాయి. ఆ రేంజ్లో బాహుబలి సినిమా ఆడింది. బాహుబలి సినిమాలు వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇప్పటకీ టీవీల్లో బాహుబలి ది బిగినింగ్ – బాహుబలి ది కంక్లూజన్ రికార్డు టీఆర్పీ రేటింగులతో దుమ్ము దులుపుతుంటాయి.
ఇక ఇప్పుడు మరో రెండు తెలుగు సినిమాలు కూడా దేశవ్యాప్తంగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాయన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఆగస్టు 30న వస్తోన్న సాహో రికార్డులు పగలకొడుతుందా ? అక్టోబర్ 2న వస్తోన్న సైరా ఎక్కువ రికార్డులు క్రాస్ చేస్తుందా ? అన్నదానిమీదే అందరి దృష్టి ఉంది. అటు చిరు, ఇటు ప్రభాస్ అభిమానుల్లో ఈ అంశంపై అప్పుడే హాట్ డిబేట్ మొదలైంది.
ఓ వైపు మెగా ఫ్యాన్స్ .. మరోవైపు రెబల్ ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల్లో వాడి వేడిగా డిబేట్లు స్టార్ట్ చేశారు. ఇక న్యూట్రల్ ఫ్యాన్స్‌లో కూడా ఈ వార్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాల్లో ఏది బెస్ట్ అనే బెట్టింగులు నడుస్తున్నాయట. ఏ సినిమా బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగరాస్తుంది? ఎవరెంత కొల్లగొడతారు? అంటూ సరదాగా స్టార్ట్ అవుతోన్న మాటలు కాస్త సీరియస్‌గా మారి చివరకు ఇవి బెట్టింగులకు కూడా దారి తీస్తున్నాయట.
ఈ రెండు సినిమాల్లో సాహోపైనే భారీగా బెట్టింగులు నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పందేలు గోదావరి జిల్లాల్లో ఎక్కువుగా నడుస్తున్నాయి. సైరా కంటే సాహో ఎక్కువ వసూళ్లు సాధిస్తాయని రూ1.కు 1.60 చొప్పున పందేలు వేస్తున్నారట. ఇండియన్ సినిమా హిస్టరీలో గ్రేట్ ఇండస్ట్రీగా చెప్పుకుంటున్న బాలీవుడ్ లో సైతం ఈ రెండు సినిమాలపై వాడి వేడిగా చర్చ సాగుతోంది. నేడు సైరా టీజర్ రాకతో ముంబై మీడియాలోనూ ఆసక్తికర చర్చ సాగింది.