సాహో ప్రీమియర్ షో టాక్

బాహుబలి చిత్రంతో ఇంటర్నేషనల్ హీరో స్థాయిని సాధించిన తెలుగు యంగ్ రెబెల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సాహో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఎట్టకేలకు సాహో చిత్రం అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసుకుంటున్న సాహో చిత్రం ఓవర్సీస్ జనాల ముందు కాస్త ముందుగానే వాలిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తుండగా.. యూఎస్ లాంటి దేశాల్లో ప్రీమియర్లతో ప్రభాస్ దుమ్ములేపాడు. ఇక ప్రీమియర్ షోస్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం సాహో చిత్రం అనుకున్న స్థాయిలో లేదని అంటున్నారు.. అనుకున్నదానికంటే దాని తాతలా ఉందని తెలుస్తోంది.

పూర్తిగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ ఓ అండర్ కవర్ కాప్‌గా నటిస్తున్నాడు. ముంబైలో జరిగిన భారీ చోరీని చేధించే హీరోగా మన డార్లింగ్ కనిపిస్తాడు. ఇక సినిమా ఫస్టాఫ్‌లో హీరో ఇంట్రొడక్షన్ మొదలుకొని ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు ప్రతీ సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని తెలుస్తోంది. అటు క్రైం బ్రాంచ్ ఆఫీసర్‌గా శ్రద్ధా కపూర్ కూడా చాలా స్టైలిష్‌గా నటించిందట. ఈ సినిమాతో అమ్మడు తెలుగు జనాలకు నేరుగా పరిచయమయ్యింది. కాగా ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే ట్విస్టుతో ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చాయి.

అటు సెకండాఫ్‌లో ప్రభాస్ గ్యాంగ్‌స్టర్ ముఠా ఆటలు అరికట్టే తీరును బాగా చూపించాడట దర్శకుడు సుజిత్. ఈ క్రమంలో వచ్చే యాక్షన్ సీక్వెన్సులతో ఆడియెన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించాడు ప్రభాస్. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాను ఎవరి అంచనాలకు అందని రీతిలో తీర్చిదిద్దడంతో బాక్సాఫీస్ ఈ సినిమాకు సాహో అనడం ఖాయమని తెలుస్తోంది.

ఏదేమైనా సాహో చిత్రంపై ఏర్పడిన అంచనాలను బ్రేక్ చేస్తూ సాహో సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయనుందని ప్రీమియర్ షో చూసిన వారు తెలిపారు. మరికొద్ది గంటల్లో సాహో చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చూడనున్నారు. మరి ఈ సినిమాకు తెలుగు ఆడియెన్స్ ఎలా కనెక్ట్ అవుతారో చూడాలి. మొత్తంగా ఈ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులను పాతర వేయడం ఖాయమని అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్. ఇక ప్రభాస్ దండయాత్ర చూసే ‘షో టైమ్’ ఆసన్నమైందని వారు అంటున్నారు.

Leave a comment