ఎరక్కపోయి ఇరుక్కున్న బ్యూటీ.. పాపం..!

ఛలో, గీతా గోవిందం చిత్రాలతో తెలుగులో ఎక్కడలేని క్రేజ్ సాధించిన బ్యూటీ రష్మిక మందన్న. అమ్మడు చేసిన రెండు సినిమాలకే పిచ్చ క్రేజ్ సాధించుకుని ఇప్పుడు బిజియెస్ట్ హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తోంది. స్టార్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి వారితో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. అయితే ఆమె తెలియకుండానే ఓ హీరో సినిమా టైటిల్‌ను లీక్ చేసింది. దీంతో సదరు హీరో ఫ్యాన్స్ అమ్మడిని ఓ రేంజ్‌లో ఏసుకుంటున్నారు.

తమిళ హీరో కార్తీతో రష్మిక తన తొలి తమిళ సినిమా చేస్తోంది. ఇటు మహేష్, అల్లు అర్జున్‌ల సినిమాలు చేస్తూనే తమిళ సినిమా షూటింగ్‌లోనూ పాల్గొంటోంది. అయితే ఈ క్రమంలో షూటింగ్ లొకేషన్ నుండి ఓ ఫోటోను షేర్ చేసిన రష్మిక ఆ సినిమా టైటిల్‌ను లీక్ చేసింది. ‘సుల్తాన్ డే 14’ అంటూ ట్యాగ్ చేసిన ఈ బ్యూటీ ఆ సినిమా టైటిల్‌ సుల్తాన్ అని లీక్ చేసి పారేసింది. దీంతో కార్తీ ఫ్యాన్స్ కొందరు సంతోషం వ్యక్తం చేయగా.. మరికొందరు మాత్రం సినిమా టైటిల్‌ను ఎలా లీక్ చేస్తావంటూ అమ్మడిని సోషల్ మీడియాలో ఏకిపారేశారు.

మొత్తానికి ఎరక్కపోయి ఫోటోను షేర్ చేయబోయిన రష్మిక ఇలా తమిళ తంబీల కోపానికి ఇరుక్కుందని సినీ క్రిటిక్స్ అంటున్నారు. ఇక ఇటీవల రష్మిక చేసిన డియర్ కామ్రేడ్ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది.

Leave a comment