టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన `రణరంగం` ఈ గురువారం ఆగస్టు 15 కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. పాటలు.. ట్రైలర్ సహా ప్రతిదీ ఆకట్టుకున్నాయి. శర్వానంద్ అంటే గత నాలుగేళ్లుగా కామెడీ, ఫ్యామిలీ సినిమాలే చేస్తూ వస్తున్నాడు.
ఇక ఇప్పుడు పంథా మార్చి శర్వా తొలిసారి గ్యాంగ్ స్టర్ గా నటించిన ఈ సినిమాపై రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రయోగం చేసినా హిట్ కొడతానన్న ధీమా శర్వాలోనూ కనిపిస్తోంది. తాజాగా ఈ సినిమా కథ కూడా ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్‌లో ఓ లైన్ చక్కెర్లు కొడుతోంది. 1990వ దశకంలో ఓ పల్లెటూర్లో జరిగిన యథార్థ కథాంశం ఆధారంగా రణరంగం స్టోరీ లైన్ ఉంటుందని తెలుస్తోంది.
శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శిని జోడీ కట్టారు. సుధీర్‌వర్మ అంటేనే థ్రిల్లర్ సినిమాలు బాగా డీల్ చేస్తాడన్న పేరుంది. ఇటు శర్వా ఫ్యామిలీ హీరో మరి ఈ ఇద్దరి కాంబోలో వస్తోన్న సినిమా కావడంతో మంచి అంచనాలే ఉన్నాయి. అటు రణరంగానికి పోటీగా మరో యువ హీరో అడవి శేష్ నటించిన ఎవరు కూడా వస్తోంది. ఈ రెండు సినిమాల పోటీలో ఎవరు పై చేయి సాధిస్తారన్నది కూడా ఆసక్తిగా మారింది.
ఇక శర్వానంద్ ఈ సినిమాతో రూ.16 కోట్లు కొల్లగొడితే సేఫ్ అవుతాడు. నైజాం-ఏపీ కలుపుకుని 13 కోట్ల బిజినెస్ చేశారు. వరల్డ్ వైడ్ -16 కోట్ల బిజినెస్ సాగింది. ప్రింట్లు పబ్లిసిటీ ఖర్చులు కాక సాగిన బిజినెస్ ఇది. మరి శర్వా ఏం చేస్తాడో ? రేపు తేలిపోనుంది.