66వ జాతీయ అవార్డ్ మహోత్స్వాల్లో తెలుగు సినిమాకు పట్టం కట్టారు. జాతీయ ఉత్తమ నటిగా కీర్తి సురేష్ అవార్డ్ సొంతం చేసుకున్నారు. తన కెరియర్ లో వచ్చిన మొదటి జాతీయ అవార్డ్ అవడంతో కీర్తి సురేష్ ఆనందానికి అవధులు లేవు. తనకు అవార్డ్ వచ్చిందన్న విషయం తెలియగానే కీర్తి సురేష్ చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యింది. ఈ అవార్డ్ అందించినందుకు చాలా పెద్ద పెద్ద థ్యాంక్స్ అంటూ మహానటి టీం కు మెసేజ్ పెట్టింది కీర్తి సురేష్.
ఇక నేషనల్ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. 7 విభాగాల్లో నేషనల్ అవార్డులు దక్కిచుకుంది. రంగస్థలం ఆడియోగ్రఫీ రాజా కృష్ణన్ ఈ అవార్డ్ అందుకోనున్నారు. ఇక ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా మహానటి సినిమా అవార్డ్ కైవసం చేసుకోనుంది. ఉత్తమ మేకప్ గా అ! సినిమాకు నేషనల్ అవార్డ్ రాగా.. స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో అ! సినిమాతో పాటుగా కె.జి.ఎఫ్ సినిమా ఈ అవార్డ్ షేర్ చేసుకోనున్నాయి. ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో చిలసౌ సినిమా అవార్డ్ అందుకుంది.
ఈ అవార్డులు అందుకున్నందుకు గాను రాజమౌళి అవార్డులు అందుకున్న వారికి శుభాకాంక్షలు తెలిపాడు. తెలుగు సినిమా నేషనల్ అవార్డ్ విన్ అయ్యినందుకు చాలా సంతోషంగా ఉందని రాజమౌళి కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం రాజమౌళి కామెంట్స్ అవార్డ్ విన్నర్స్ కు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి.