బాహుబలి సీరిస్ సినిమాలు, సాహో ఎఫెక్ట్‌తో ఆల్ ఇండియా స్టార్ గా ప్రభాస్ అవతరించాడు. ఈ స్టార్ డమ్ నిలబడుతుందా? లేదా అన్నది సాహో ఫలితం చెబుతుంది. బాహుబలి రెండు భాగాలకు కలిపి ప్రభాస్‌కు ఎంత ఇచ్చారన్నది సరైన క్లారిటీ లేదు. కొందరు రూ.20 కోట్ల పైమాటే అని చెపితే.. ప్రభాస్ సన్నిహిత వర్గాల ద్వారా బయటకు వచ్చిన మాట రూ.15 కోట్ల లోపే అన్నది టాక్. ఇక ఇప్పుడు సాహో సొంత సినిమా… సొంత సినిమాకు రెమ్యునరేషన్ కంటే లాభాలే ఇవ్వొచ్చు. ప్రమోద్, వంశీ, ప్రభాస్ అంతా సన్నిహితులే అన్నది తెలిసిందే.
సాహో ఫలితం తర్వాతే ప్రభాస్ అసలు సిసలు రెమ్యునరేషన్ ఎంతన్నది బయటకు వస్తుంది. ప్రస్తుతానికి తెలుగులో మహేష్‌బాబు రూ.50 కోట్లు తీసుకుంటూ టాప్ ప్లేసులో ఉన్నాడు. నాన్ థియేట్రికల్ రైట్స్ మొత్తం అతడి ఖాతాలోకే.. బన్నీ రేంజ్ రూ.25 కోట్ల వరకు ఉంది. ఎన్టీఆర్ రేంజ్ రూ. 28 -30 కోట్ల మధ్యలో ఉంది. సాహో అన్ని భాషల్లో హిట్ అయ్యి ఏ రూ.300 కోట్లో రాబడితే అప్పుడు ప్రభాస్ రెమ్యునరేషన్ ఎక్కడికో వెళ్లిపోతుంది.
ప్రభాస్‌తో ఏ బాలీవుడ్ వాళ్లో సినిమా తీస్తే ఆల్ ఇండియా రైట్స్ వాళ్లకు వదిలేసి తెలుగు రైట్స్ ఉంచుకున్నా ప్రభాస్‌కు బోల్డెంత్ అమౌంట్ వస్తుంది. అంటే రూ.80-100 కోట్ల వరకు వస్తుంది. అదంతా జరగాలంటే సాహో ఏ రేంజ్ హిట్ అవుతుందన్నదానిపైనే ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా సాహో హిట్ రేంజ్ ? ఏ రేంజ్ వసూళ్లు సాగిస్తుందన్నది తెలిసిన తరువాతనే ప్రభాస్ రేంజ్ ఏమిటన్నది ఓ అయిడియా వస్తుంది.