టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అటు పౌరాణిక పాత్రలతో పాటు.. ఇటు సాంఘిక పాత్రలతో ఈతరం జనరేషన్ హీరోలలో తిరుగులేని విధంగా మెప్పిస్తున్నాడు. చిన్నప్పుడే బాల రామాయణం సినిమాలో రాముడిగా, యమదొంగ సినిమాలో యముడిగా, జై లవకుశ సినిమాలో రావణ్ క్యారెక్టర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్టీఆర్ ప్రతి క్యారెక్టర్లో ఎంతో వైవిధ్యం చూపిస్తాడు. ఇదిలా ఉంటే జై లవకుశ లాంటి సాంఘిక కథాంశం ఉన్న సినిమాలో రావణ పాత్రను అద్భుతంగా పోషించిన ఎన్టీఆర్… ఇప్పుడు రామాయణం సినిమా లో నిజమైన రావణాసురుడిగా కనిపించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
అత్యంత భారీ బడ్జెట్ తో నితీశ్ తివారీ, రవి ఉద్యవార్ దర్శకత్వంలో ‘రామాయణ’ అనే పేరుతో ‘రామాయణం’ను తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎంతోమంది ప్రముఖులు నటిస్తున్నారు. రామాయణం అంటే ఎన్నో పాత్రలు ఉంటాయి. అందుకే వివిధ భాషల్లో పేరున్న నటీనటులు అందరితోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ రామాయణంలో ఎంతో కీలకమైన రావణుడు పాత్రను ఎవరు పోషించనున్నారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రావణుడు పాత్రకు ఎన్టీఆర్ అయితేనే సరైన న్యాయం చేస్తాడని చిత్ర మేకర్స్‌లో కొందరు భావిస్తున్నారట. అందుకే ఇప్పుడు నెటిజన్లు కూడా ఇందుకు మద్దతుగా ఈ సినిమాలో రావణుడు పాత్రకు ఎన్టీఆర్‌నే తీసుకోవాలని చూస్తున్నారట. ఈ తరంలో హిస్టారికల్ పాత్రలు చేయాలంటే ఒక్క ఎన్టీఆరే గుర్తుకు రావడం నిజంగా విశేషమే. ఈ తరం జనరేషన్ హీరోల్లో పౌరాణిక పాత్రల్లో నటించేందుకు ఆసక్తిగా ఉన్న హీరోలు తక్కువగానే ఉన్నారు. ఈ విషయంలో ఆసక్తితో ఉండే ఎన్టీఆర్ ఈ పాత్ర చేస్తే మామూలు క్రేజ్ ఉండదు.
ఇక ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రాలతో కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమా మూడు భాగాలుగా ఉండనుంది. అది కూడా త్రీడీ ఫార్మాట్లో కావడం విశేషం. మొదటి భాగాన్ని 2021 నాటికి ప్రేక్షకులకు అందివ్వాలనుకుంటున్నారు నిర్మాతలు.