రికార్డుల మాస్టర్ అయిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. తాజాగా వెస్టిండిస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సీరిస్ టీమిండియా 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మూడు వన్డేల సీరిస్‌ను భారత్ 2-0తో క్లీన్‌స్వీప్ చేసేసింది. రెండు వన్డేల్లోనూ కెప్టెన్ కోహ్లీ సెంచరీలు బాదాడు. ఈ క్రమంలోనే కోహ్లీ కొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకూ కోహ్లి వన్డేల్లో 43 సెంచరీలు సాధించి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వన్డే శతకాల రికార్డుకు మరింత చేరువగా వచ్చాడు.
సచిన్ వన్డేల్లో 49 సెంచరీలు సాధించగా, ఆ మార్కును చేరడానికి కోహ్లికి ఆరు సెంచరీల దూరంలో నిలిచాడు. అలాగే మరో తిరుగులేని రికార్డు కూడా కోహ్లీ ఖాతాలో పడింది. అంతర్జాతీయ క్రికెట్‌లో దశాబ్ద కాలంలో ఎక్కువ పరుగులు చేసిన క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు సాధించాడు. ఇప్పటివరకూ ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉండగా, దాన్ని కోహ్లి బ్రేక్ చేశాడు. 10 సంవత్సరాల కాలంలో తీసుకుంటే పాంటింగ్ 200 మ్యాచ్‌లు ఆడి 18,962 పరుగులు సాధించాడు.
తాజాగా కోహ్లీ ఆ రికార్డు బ్రేక్ చేశాడు. ఈ క్రమంలోనే వన్డే ఫార్మాట్లో ఎక్కువ సెంచరీలు చేసిన కెప్టెన్‌గా కూడా కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. వన్డే కెప్టెన్‌గా కోహ్లి 21 శతకాలు చేయగా, ముందు వరుసలో పాంటింగ్ ఉన్నాడు. పాంటింగ్ 22 సెంచరీలతో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. మరో రికార్డు కూడా కోహ్లీ ఖాతాలో పడింది. విండీస్ పర్యటనలో ఎక్కువ సెంచరీలు చేసిన రికార్డు ఇప్పటి వరకు మాథ్యు హెడెన్ పేరిట ఉండేది. ఇప్పుడు కోహ్లీ నాలుగు సెంచరీలతో దానిని బీట్ చేశాడు.