బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ కొబ్బరిమట్ట. ఇప్పటికే యేడాది కాలంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోన్న ఈ సినిమా శనివారం రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు యునాన్‌మస్‌గా హిట్ టాక్ రావడంతో సంపూర్ణేష్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఉదయం ఆట అవ్వగానే సంపూ అభిమానులు మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ సినిమా గురించి చాలా పాజిటివ్‌గా కామెంట్లు పెడుతున్నారు.
ఈ సినిమాను చూసిన వారు ఈ వీకెండ్‌లో వచ్చిన సినిమాల్లో కొబ్బరిమట్టకే ఓటేసినట్లు తెలుస్తోంది. నాగార్జున మన్మథుడు 2 సినిమాతో పాటు అనసూయ కథనం, కన్నడ డబ్బింగ్ మూవీ కురుక్షేత్ర, విశాల్ టెంపర్ రీమేక్ అయోగ్య ఉన్నా కూడా కొబ్బరిమట్టకే మంచి టాక్ వచ్చింది. సినిమా అంతా కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉందట.
ఇక సంపూ మూడు పాత్రలతో యాక్టింగ్ పరంగా చింపేశాడంటున్నారు. తనదైన టైమింగ్ కామెడీతో కడుపుబ్బా నవ్వించడంతో పాటు నాన్-స్టాప్ లాంగ్ డైలాగ్‌తో ప్రేక్షకుల మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాడు. మూడు పాత్రల్లోనూ హీరో క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ హైలెట్ అని… అటు కామెడీతో పాటు ఇటు ఎమోషనల్‌గా కూడా మెప్పించాడంటున్నారు. మొత్తానికి సంపూకు హృదయ కాలేయం తర్వాత మరో మాంచి హిట్ వచ్చిందంటున్నారు. కొబ్బరిమట్టపై పబ్లిక్ టాక్ ఎలా ఉందో ఈ వీడియోలో చూడండి.