Gossipsఆ విషయంలో కాజల్ చాలా వీక్

ఆ విషయంలో కాజల్ చాలా వీక్

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తోంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా దాదాపు పదేళ్లుగా ఇండస్ట్రీని ఏలుతున్న ఈ బ్యూటీ ఇంకా తన సత్తా చాటుతూనే ఉంది. చిన్న, పెద్ద అంటూ తేడా లేకుండా అందరు హీరోలతో సినిమాలు చేస్తూ తన స్టామినాను ప్రూవ్ చేస్తున్న కాజల్ ఒక్క విషయంలో మాత్రం చాలా వీక్ అని అంటున్నారు ఆమె అభిమానులు.

ఇంతకీ కాజల్ పాప ఏ విషయంలో వీక్ అనుకుంటున్నారా..? అమ్మడు వచ్చింది ముంబై నుండే అయిన ఆమె బాలీవుడ్‌లో సక్సెస్ కాలేకపోయింది. అజయ్ దేవ్గన్‌తో కలిసి చేసిన సింగం సినిమా తప్ప అమ్మడికి బాలీవుడ్‌లో పెద్ద సినిమాలు లేవు. ప్రస్తుతం చేతిలో కూడా బాలీవుడ్ సినిమాలు ఏమీ లేవు. దీంతో ఆమె బాలీవుడ్‌లో ఎప్పుడు సక్సెస్ అవుతుందా అని ఆశగా చూస్తున్నారు ఆమె ఫ్యాన్స్. అటు మిగతా హీరోయిన్లైన రకుల్, తాప్సీ, నిత్యా మీనన్ లాంటి వారు బాలీవుడ్‌ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. మరి కాజల్ పాపకు ఎందుకు ఆఫర్స్ రావడం లేదు అని ఆమె ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఏదేమైనా టాలీవుడ్‌లో పదేళ్లుగా తన సత్తా చాటుతున్న కాజల్, బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఏదేమైనా కాజల్ బ్యూటీ ఆ ఒక్క విషయంలో వెనుకబడి ఉందనే చెప్పాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news