విండీస్ తో జరిగిన తీన్మార్ టీ-20 సిరీస్ మొదటి రెండు మ్యాచ్ ల్లోనే మాజీ చాంపియన్ భారత్.. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో సిరీస్ ను 2-0తో కైవసం చేసుకొంది. పెద్దగా కష్టపడకుండానే రెండో టి20 కూడా భారత్ వశమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. విజయానికి 27 బంతుల్లో 70 పరుగులు అవసరమైన దశలో విండీస్ 98/4తో ఉన్న స్థితిలో వర్షం కారణంగా మ్యాచ్‌ను నిలిపివేశారు. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఇండియా 22 పరుగులతో గెలిచింది.
ఇక ఈ మ్యాచ్‌లో కొన్ని రికార్డులు క్రాస్ అయ్యాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.
– ఇంటర్నేషనల్ 20 – 20 క్రికెట్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ (107) రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో రోహిత్ 51 బంతుల్లో 67 ( 6 ఫోర్లు, 3 సిక్స్‌లు ) పరుగులు సాధించారు. ఈ క్రమంలోనే రోహిత్ క్రిస్ గేల్ (విండీస్–105) పేరిట ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు.
– అంతర్జాతీయ 20 – 20 క్రికెట్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లి (225) రికార్డు నెలకొల్పాడు. దిల్షాన్ (శ్రీలంక–223) పేరిట ఉన్న రికార్డును కోహ్లి అధిగమించాడు.
– ఇక 20 – 20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా సురేశ్ రైనా (8,392) పేరిట ఉన్న రికార్డును కోహ్లి (8,416) సవరించాడు. ఈ రికార్డును భారత్ క్రికెటర్ రైనా పేరిట ఉండగా ఇప్పుడు మరో భారత్ బ్యాట్స్‌మెన్ కోహ్లీ బీట్ చేశాడు.
– రెండు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఉన్న ద్వైపాక్షిక 20 – 20 సిరీస్‌లను భారత్ 12 సార్లు సొంతం చేసుకుంది.
– ఇక ఇంటర్నేషనల్ 20 – 20 మ్యాచ్‌లలో విండీస్‌కిది 57వ ఓటమి. అత్యధిక పరాజయాలు పొందిన జట్ల జాబితాలో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల సరసన విండీస్ చేరింది.