పెళ్లి కొడుకు కావాలంటున్న బాల‌య్య హీరోయిన్

క‌న్నడ భామ హరిప్రియ 2010 లో `తకిట తకిట` చిత్రంతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు పరిచయమైంది. ఎన్నో తమిళ , కన్నడ ,తె లుగు సినిమాలలో నటించింది. హరిప్రియ మొదట మోడల్‌గా పనిచేసారు. కన్నడ భాషా చిత్రాలలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. తెలుగులో పిల్లజమీందార్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, గ‌లాట‌, జై సింహా చిత్రంలో బాల‌కృష్ణ స‌ర‌స‌న కూడా న‌టించింది. అయినా తెలుగు సినిమాల్లో పెద్దగా ప‌ట్టు సాధించ‌లేక‌పోయింది. అయితే ఆమె ఇప్పుడు పెళ్లి పీట‌లు ఎక్క‌బోతుంద‌ని చాలా రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ క్ర‌మంలోనే ఎన్నో క‌థ‌నాలు పుట్టుకొచ్చాయి. అయితే వీటికి చెక్ పెడుతూ ట్విటర్‌ వేదికగా.. తాను ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకోవ‌డం లేద‌ని, తాను ఇప్పుడు సినిమాల‌తో బిజీగా ఉన్నాన‌ని, ముఖ్యంగా పెళ్లి చేసుకోవాలంటే జీవిత భాగస్వామి ఇంకా దొర‌క‌లేద‌ని స్ప‌ష్టం చేసింది. అలాగే నా దృష్టి మొత్తం సినిమాలపైనే ఉంది. కాబోయేవాడిని వెతకడానికి ఇదే సరైన సమయం అనుకుంటా… అంటూ ట్విట్ట‌ర్‌లో స‌మాధానం ఇచ్చింది.

వాస్త‌వానికి హ‌రిప్రియపై ఇలాంటి వార్త‌లు రావ‌డం కొత్తేమి కాదు. ఇంత‌కు ముందు కూడా ఆమె ఎవ‌రితోనూ ప్రేమాలో ఉన్నార‌ని అనేక పుకార్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. అప్పుడు కూడా వాటికి చెక్ పెడుతూ.. ‘నా ప్రియుడి పేరు కూడా మీరే చెప్పేయండి’ అంటూ మండిపండింది. మ‌ళ్లీ ఇప్పుడు పెళ్లిపై అనేక క‌థ‌నాల‌కు ఆమె స‌మాధానం ఇచ్చింది. ప్రస్తుతం కన్నడ సినిమాల‌తో బిజీ ఉంది. అలాగే ఆమె న‌టించిన చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Leave a comment