సినిమా: గుణ 369
నటీనటులు: కార్తికేయ, అనఘ, ఆదిత్య మీనన్, శివాజీ రాజా తదితరులు
సింగీతం: చేతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: రామ్ రెడ్డి
నిర్మాత: అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి, ప్రవీణ కడియాల
దర్శకుడు: అర్జున్ జంధ్యాల
RX100 సినిమాతో ఒక్కసారిగా సక్సెస్‌ఫుల్ హీరోగా మారాడు కార్తీకేయ. ఆ తరువాత మనోడి రేంజ్ ఒక్కాసారిగా ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే ఆ సినిమాతో వచ్చిన సక్సెస్‌ను ఆ తరువాత చిత్రంలో కంటిన్యూ చేయలేకపోయాడు. కాగా కార్తికేయ తాజాగా గుణ 369 అనే సినిమాతో మనముందుకు వస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర అలరిస్తుందో రివ్యూలో చూద్దాం.
కథ:
గుణ(కార్తికేయ) తన స్నేహితులు, కుటుంబంతో కలిసి జాలీగా జీవిస్తుంటాడు. సెల్‌ఫోన్ షాపులో పనిచేసే గీత(అనఘ)ను ప్రేమిస్తాడు గుణ. ఈ క్రమంలో అతడు తన ప్రేమను సాధించేందుకు చేసిన ప్రయత్నం బెడిసి కొడుతుంది. కాగా ఓ మర్డర్ కేసులో గుణ నేరస్థుడిగా ప్రూవ్ కావడంతో జైలుకు వెళతాడు. అసలు మర్డర్ ఎవరు చేశారు..? ఆ మర్డర్‌తో గుణకు సంబంధం ఏమిటి? చివరకు ఆ మర్డర్ కేసును హీరో ఎలా ఛేదించాడు? అనేది సినిమా కథ.
విశ్లేషణ:
RX100 లాంటి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ తరువాత హిప్పీ అనే తలాతోక లేని సినిమాతో వచ్చిన కార్తికేయ ఈ సారి కాస్త కంటెంట్ ఉన్న సినిమాతో వచ్చాడు. అయితే ఈ సినిమా కథ తాతల కాలం నాటి నుండి వస్తున్న కథ కావడంతో ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించరు. ఫస్టాఫ్‌లో హీరో పాత్రను ఇంట్రొడ్యూస్ చేయడం.. స్నేహితులతో, కుటుంబంతో అతడు జాలీగా జీవిస్తుండట చూపించారు. హీరోయిన్‌ను ప్రేమించిన గుణ ఆమె ప్రేమను సాధించేందుకు ప్రయత్నాలు మెప్పిస్తాయి. ఈ క్రమంలో అతడికి కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్టుతో ఇంటర్వెల్ బ్యాంగ్ రావడంతో సెకండాఫ్‌లో ఏం జరుగుతుందనే ఆసక్తి ఏర్పడుతుంది.
ఇక సెకండాఫ్‌లో ఒక మర్డర్ కేసులో హీరో జైలు వెళ్లడం..దాని నుంచి అతడు తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం బాగున్నాయి. అయితే కొన్ని లాజిక్ లేని సీన్స్ ప్రేక్షకులకు విసుగు పుట్టిస్తాయి. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్‌లో పెద్దగా మ్యాటర్ లేకపోవడంతో సెకండాఫ్ పూర్తిగా తేలిపోయింది. ఆకట్టుకోని స్క్రీన్‌ప్లే, ల్యాగింగ్ సీన్స్, లాజిక్ మిస్ అయిన సీన్స్, కలగలిసి సెకండాఫ్‌ను దెబ్బేశాయి.
ఓవరాల్‌గా చూస్తే ఒక సాధారణ కథ అయినప్పటికీ దాన్ని ఆసక్తికరంగా మల్చడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. రొటీన్ కథను తలపించే ఫస్టాఫ్, ఇంట్రెస్టింగ్ అంశాలు లేని సెకండాఫ్ కలగలిసి సినిమాను ఒక బిలో యావరేజ్ మూవీగా నిలిపాయి.
నటీనటుల పర్ఫార్మెన్స్:
గుణ పాత్రలో నటించిన కార్తికేయ సినిమా ఆధ్యాంతం మెప్పించాడు. హిప్పీ మూవీలో చేసిన తప్పులు తెలుసుకున్న హీరో అవి రిపీట్ కాకుండా చూసుకున్నాడు. సినిమాలో పెద్దగా పరిచయం లేని మొహాలు ఉండటంతో హీరోను చూసేందుకే జనాలు ఆసక్తి చూపించారు. ఇక యాక్షన్, రొమాన్స్, ఎమోషన్ సీన్స్‌లో కార్తికేయ మెప్పించాడు. హీరోయిన్ పాత్రలో నటించిన అనఘ నటన పరంగా చాలా నేర్చుకోవాలి. మిగతా నటీనటులు వారి పరిధిమేర మెప్పించారు.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు అజయ్ జంధ్యాల తీసుకున్న స్టోరీలైన్ రొటీన్ అయినప్పటికీ ఆకట్టుకునే స్క్రీన్‌ప్లే ఉండి ఉంటే ఈ సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది. అయితే ల్యాగింగ్ సీన్స్ ఈ సినిమాను ట్రాక్ తప్పించాయి. దర్శకుడు తాను అనుకున్న విషయాన్ని చెప్పడంలో దారితప్పాడు. సంగీతం సినిమాకు చేసింది పెద్దగా ఏమీ లేదు. ఒకటి రెండు పాటలు మినహా పెద్దగా ఇంప్రెస్ చేయదు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బాగుండాల్సింది. నిర్మాణ విలువలు ఓకే.
చివరగా:
గుణ 369 – రొటీన్ కొట్టుడు!
రేటింగ్:
2.75/5.0