తీవ్ర ఉత్కంఠ రేపే ‘ ఎవ‌రు ‘ …. సూప‌ర్ ట్రైల‌ర్‌

గూఢ‌చారి సినిమాతో తిరుగులేని హిట్ త‌న ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో అడ‌వి శేష్ చాలా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఎవ‌రు. పీవీపీ బ్యాన‌ర్‌పై పొట్లూరి ప్ర‌సాద్ నిర్మించిన ఈ సినిమా ట్రైల‌ర్ తాజాగా రిలీజ్ అయ్యింది. 1.39 నిమిషాల పాటు ఉన్న ట్రైల‌ర్ అనుక్ష‌ణం ఉత్కంఠ రేపింది. షాట్లు చాలా క్రిస్పీగా ఉన్నాయి.

సినిమా అంతా ఓ మ‌ర్డ‌ర్ చుట్టూ తిరుగుతుంద‌ని అనిపిస్తోంది. ఈ హ‌త్య‌కు రెజీనాకు ఏదో లింక్ ఉంద‌ని ట్రైల‌ర్ చెప్పేస్తోంది. రెజీనా మీద మ‌ర్డ‌ర్ ఎటెంప్ట్ జ‌రిగిన‌ట్టుగా కూడా తెలుస్తోంది. అడ‌వి శేష్‌, రెజీనా పాత్ర‌లు సినిమాకు కీల‌కం కాగా… న‌వీన్ చంద్ర కూడా మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టించాడు.

రెజీనా మీద ప‌లుమార్లు రేప్‌, మ‌ర్డ‌ర్ ఎటెంప్ట్‌లు జ‌ర‌గ‌డంతో ఆమె త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నాలు కూడా చేస్తోంది. నిర్మాత పీవీపీ సినిమాకు భారీగానే ఖ‌ర్చు చేశారు. నేప‌థ్య సంగీతం కూడా బాగుంది. సినిమాటోగ్ర‌ఫీ సూప‌ర్బ్‌గా ఉంద‌ని విజువ‌ల్స్ చెప్పేస్తున్నాయి. మేకింగ్ విష‌యంలో ఎక్క‌డా రాజీప‌డ‌లేదు.

ట్రైల‌ర్ అనుక్ష‌ణం ఉత్కంఠ రేపుతోంది. రెజీనా- శేష్ మ‌ధ్య వ‌చ్చే ఇన్‌ఫ‌ర్మేష‌న్ ఇవ్వ‌డానికి వ‌చ్చావా ? ఇంట‌ర్య్వూ చేయ‌డానికి వ‌చ్చావా ? డ‌బ్బులు చేసుకుందామ‌ని వ‌చ్చాను… లాంటి డైలాగులు బాగున్నాయి. వెంక‌ట రామ్‌జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఆగ‌స్టు 15న థియేట‌ర్లోకి వ‌స్తోంది. మొత్తానికి టీజ‌ర్‌తో ఆస‌క్తి రేపిన ఈ సినిమా ఎలా ఉంటుందో ? చూడాలి.