టాలీవుడ్ లో వెరైటీ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న అడివి శేష్ ఈసారి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఎవరుతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. వెంకట్ రాంజీ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ లో పరం వి పొట్లూరి నిర్మించారు. అడివి శేష్ తో పాటుగా ఈ సినిమాలో రెజినా కసాండ్రా, నవీన్ చంద్ర నటించారు. ఈరోజు రిలీజవుతున్న ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
కరెప్టెడ్ పోలీస్ ఆఫీసర్ అయిన విక్రం వాసుదేవ్ (అడివి శేష్) తనకు లాభం వచ్చే ఏ పనిని వదిల్పెట్టడు. అలాంటిది అతను ఓ హత్య కేసు విచారణలో దిగుతాడు. సమీరా (రెజినా) అశోక్ కృష్ణ (నవీన్ చంద్ర)ను హత్య చేస్తుంది. అసలు ఎందుకు సమీరా అశోక్ కృష్ణను హత్య చేయాల్సి వచ్చింది. మరో పక్క ఓ మిస్సింగ్ కేసు విచారణ జరుగుతుంది. ఆ మిస్సింగ్ కేసుకు ఈ హత్యకు సంబంధం ఏంటి. విక్రం వాసుదేవ, సమీరాల మధ్య రిలేషన్ ఏంటి..? సమీరా ఈ కేసు నుండి ఎలా బయట పడ్డది అన్నది సినిమా కథ.
నటీనటుల ప్రతిభ :
విక్రం వాసుదేవ పాత్రలో అడివి శేష్ ఎప్పటిలానే అదరగొట్టాడు. ఈ సినిమాలో కరెప్టెడ్ పోలీస్ గా కాస్త ఎక్కువ ఇంప్యాక్ట్ కలిగేలా చేశాడు. రెజినా నటన చాలా బాగుంది. సహజత్వంగా నటించడానికి బాగా ట్రై చేసింది. నవీన్ చంద్ర కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. మురళి శర్మతో పాటుగా మిగతా నటీనటులు కూడా పరిధి మేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు :
వెంకట్ రాంజీ స్పానిష్ థ్రిల్లర్ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. సినిమా మొత్తం గ్రిప్పింగ్ గా అనిపిస్తుంది. అయితే ఫస్ట్ హాఫ్ కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. కథ, కథనాల్లో దర్శకుడు తన పనితీరు కనిపించాడు. వంశీ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకు ఆయన కెమెరా వర్క్ బాగా హెల్ప్ అయ్యింది. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తుంది. బిజిఎం ఓకే అనిపించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కథకు ఎంత అవసరమో అంత పెట్టారు.
విశ్లేషణ :
తన ప్రతి సినిమాకు కొత్త అనుభూతిని ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న అడివి శేష్. ఈసారి సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ తో చేసిన సినిమా ఎవరు. సినిమా టీజర్, ట్రైలర్ తో సినిమాపై ఆసక్తి పెంచాడు. అయితే సినిమా కూడా అదే రేంజ్ లో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో నడిపించాడు. కాని అక్కడక్కడ నాటాకీయంగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగుంది.
ఫస్ట్ హాఫ్ కాస్త అటు ఇటుగా ఉన్నా ఇంటర్వల్ అదరగొట్టారు. ఇక సెకండ్ హాఫ్ మొత్తం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నారు. ఊహించని ట్విస్టులతో సినిమా మొత్తం చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది. అయితే ఫస్ట్ హాఫ్ ఇంకాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది. సినిమా రెండు గంటలకు తక్కువ రన్ టైం ఉండటం కూడా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.
ఇక యూత్ ఆడియెన్స్ తో పాటుగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను చూసే ప్రేక్షకులకు ఎవరు నచ్చుతుంది. అడివి శేష్ క్షణం, గూఢచారి సినిమాల సరసన ఎవరు నిలుస్తుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే, కాస్టింగ్ అన్ని సినిమాకు కలిసి వచ్చిన అంశాలు.
ప్లస్ పాయింట్స్ : అడివి శేష్
రెజినా
స్టోరీ లైన్
మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్
ప్రొడక్షన్ వాల్యూస్
మ్యూజిక్
బాటం లైన్ : అడివి శేష్ ‘ఎవరు’.. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ..!
రేటింగ్ : 3/5