టాలీవుడ్ లో హాట్ బ్యూటీ మిట్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ తమన్నా భాటియా. హ్యాపీడేస్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఇప్పుడు తెలుగు, హిందీ, తమిళ్ లో నటిస్తుంది. అయితే తమన్నా ఎలాంటి కాంట్రవర్సీలకు వెళ్లదు..అలాంటిది తమన్నా రచ్చ చేయడం ఏంటా అనుకుంటున్నారా..! అయితే మీరు తప్పులో కాలేసినట్లే. తమన్నా అంటే సినీ తార తమన్నా కాదు..బిగ్ బాస్ 3 లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి.
మె ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజు నుంచే బిగ్ బాస్ 3 లో సంచలనాలు మొదలయ్యాయి. ఎవరి మాటా వినదు..తన ఇష్టానుసారంగా చేస్తుంది. అల్లరి గా అందరినీ ఆటపట్టిస్తుంది. హౌస్ లో ఆమె ప్రవర్తన కారణంగా అటు కంటెస్టంట్స్ తో పాటు ఇటు ప్రేక్షకులు కూడా విసిగిపోతున్నారు. నిన్న ఎలిమినేషన్ రౌండ్ లో ఎవరిని ఎలిమినేట్ చేయాలో వారికి ఓ ముద్ర కొట్టాలని బిగ్ బాస్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరూ తాము ఎవరిని ఎలిమినేట్ చేస్తున్నామో..అందుకు కారణాలు కూడా చెప్పారు. ఇలా తమన్నాను ఎక్కువ టార్గెట్ చేయడంతో ఆమె దారుణంగా తిట్టడం మొదలు పెట్టింది.
ఈ నేపథ్యంలో రవికృష్ణ, అలీని టార్గెట్ చేసి నానా మాటలంది. ఇవి భరించలేక శ్రీముఖి, రోహిణిలు ఆమెకి చెబుతుంటే వారిపై కూడా ఫైర్ అయింది. ఎలిమినేషన్ రౌండ్ పూర్తయిన తర్వాత రవికృష్ణను పట్టుకొని దారుణంగా మాట్లాడింది. నువ్ అసలు మగాడివేనా? ఉన్న వాటిని కూడా గీసేసుకో.. పప్పూ అంటూ వ్యక్తిగతంగా అతడిని దూషించింది. దాంతో ఆమెకు నచ్చజెప్పాలని ఇంటి సభ్యులు చూసినా..హౌస్ లో తనకు ఇష్టం వచ్చినట్లు ఉంటానని.. తనకు నచ్చింది చేస్తానని.. తనకు ఎవరైనా లెక్చర్ ఇస్తే మామూలుగా ఉండదని వార్నింగ్ ఇచ్చింది.