భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున కొచ్చిలోని శ్రీశాంత్ నివాసంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కలకలం రేగింది. షార్ట్ సర్య్కూట్‌తో మంటలు అంటుకున్నాయి. దీంతో ముందుగా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వ్యాపించిన మంటలు.. బెడ్ రూమ్ వరకూ వ్యాపించాయి. మంటలు చాలా స్పీడ్‌గా వ్యాపించడంతో బెడ్ రూం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో ఎవరకూ గాయపడలేదు.
శ్రీశాంత్ భార్యా పిల్లలు సురక్షితంగా బయటకు వచ్చారు. స్థానికుల సాయంతో ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన తమ ఇంటికి వచ్చి మంటలను అదుపు చేసినట్టు శ్రీశాంత్ తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. శ్రీశాంత్ భార్యా పిల్లలు ఫస్ట్ ఫ్లోర్ చిక్కుకుపోవడంతో గ్లాస్‌ను బద్దలు కొట్టి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
ప్రమాదం జరిగినప్పుడు శ్రీశాంత్ ఇంట్లో లేడు. దీంతో విషయం తెలుసుకున్న శ్రీశాంత్ ఆ దేవుడే తన పిల్లలను కాపాడాడని భావోద్వేగానికి గురయ్యాడు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం. ఇదిలా ఉంటే శ్రీశాంత్ కుటుంబం అగ్నిప్రమాదం భారీ నుంచి తప్పించుకుని సురక్షితంగా ఉండడంతో పలువురు ఆయనకు ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం శ్రీశాంత్‌పై ఉన్న జీవిత కాల నిషేధాన్ని బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే ఏడేళ్లకు కుదించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలుప ఇప్పటికే ఆరేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న శ్రీశాంత్ ఇంకా ఏడాది పాటు నిషేధం ఎదుర్కోనున్నాడు.