యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమాతో దేశం మొత్తం ఊగిపోతోంది. ఎక్కడ చూసినా సాహోరే సాహో అని సినిమా లవర్స్ ప్రభాస్‌ను కీర్తించేస్తున్నారు. బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్‌తో ప్రభాస్ ఇప్పుడు నేషనల్ స్టార్ అవ్వడం… ఇటు సాహో ఏకంగా రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కడంతో ఈ సినిమా సామాన్య సినీ అభిమానులనే కాకుండా సెలబ్రిటీలను కూడా ఆకర్షిస్తోంది.
సాహో తెలుగు, తమిళ్, మళయాళం, హిందీ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. బుక్ మై షో లాంటి యాప్‌లలో బాలీవుడ్ ఖాన్‌ల సినిమాలకే 3 లక్షల లైకులు వస్తే గొప్ప.. అలాంటిది సాహో ఏకంగా 5 లక్షల లైక్స్ దిశగా దూసుకుపోతోంది. బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం సాహో క్రేజ్ చూసి షాక్ అవుతున్నారు.
ఇటు చెన్నై, బెంగళూరు లాంటి నగరాల్లోనూ సాహో ఫీవర్ ఫుల్లుగా ఉంది. అక్కడ ఆన్‌లైన్‌లో టిక్కెట్లు పెట్టిన వెంటనే కొనేస్తున్నారు. ఇదిలా ఉంటే రాజుల రాజధానిగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో సాహో ఫీవర్ ఇంకా ఏ రేంజులో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ రోజు అక్కడ ఉన్న మల్టీఫ్లెక్స్‌లోని నాలుగు స్క్రీన్లతో పాటు అన్ని థియేటర్లలోనూ సాహోనే ప్రదర్శిస్తున్నారు.
భీమవరంలో ఎర్లీ మార్నింగ్ షోకి టికెట్ రేటు ఒక్కోచోట మూడువేలు పలుకుతోంది. భీమవరం పట్టణం నిండా భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈస్ట్ వెస్ట్ కలిపి రూ. 19 కోట్లకు విక్రయించారు. రెండుజిల్లాల్లో తొలిరోజు షేర్ ఏ మేరకు వుంటుందన్నది చూడాలి.