యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమా కోసం తెలుగు సినిమా ప్రేక్షకులే కాదు యావత్ భారతదేశ మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 15న రావాల్సిన ఈ సినిమా కాస్త వాయిదా పడి ఈ నెల 30న వరల్డ్ వైడ్‌గా నాలుగు భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. బాహుబలి లాంటి హిస్టారికల్ హిట్ సినిమా తర్వాత రెండేళ్ల పాటు కష్టపడి ప్రభాస్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
ఇండియన్ సినిమా చరిత్రలో హైఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటిదాకా భారతీయ తెరపై చూడని యాక్షన్ ఫీస్ట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా రన్ టైం లాక్ అయినట్టు తెలుస్తోంది. సాహో రన్ టైం మొత్తం 2 గంటల 52 నిమిషాల పాటు ఉంటుందట. అంటే 172 నిమిషాల పాటు సాహో రన్ అవుతుంది.
ఫస్టాఫ్ 1 గంట 24 నిముషాలు… సెకండ్ హాఫ్ దానికంటే ఎక్కువగా 1 గంట 28 నిముషాలు ఉందని తెలుస్తోంది. అంటే మొత్తం మూడు గంటలకు 8 నిమిషాల తక్కువుగా సినిమా నిడివి ఉంటుంది. ఓ విధంగా చూస్తే ఇది కాస్త ఎక్కువ నిడివే అని చెప్పాలి. అయితే బాహుబలి, శ్రీమంతుడు, రంగస్థలం లాంటి సినిమాల రన్ టైం కూడా చాలా ఎక్కువే. ప్రేక్షకుడిని కుర్చీలో కూర్చోపెట్టే కంటెంట్ ఉన్నప్పుడు రన్ టైం ఎక్కువ ఉన్నా సమస్య కాదన్నది ఇప్పటికే రుజువు అయ్యింది.
ఇక సాహో కూడా విజువల్ ఫీస్ట్ కావడంతో కంటెంట్ కనెక్ట్ అయితే రన్ టైం ఎక్కువ ఉన్నా పెద్ద ఇబ్బందేం కాదంటున్నారు. మరి సుజీత్ ఎలాంటి టైట్ స్క్రీన్ ప్లే రాసుకున్నాడన్నది ఒక్కటే సస్పెన్స్. ఓవరాల్‌గా సాహో రిజల్ట్ ఎలా ఉంటుందో ? అన్న ఉత్కంఠ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ టెన్షన్ ఈ నెల 30 వరకు తప్పదు.