మెగా హీరోల పేరుతో నానికి బెదిరింపులు..

నేచుర‌ల్ స్టార్ నాని తాజా చిత్రం గ్యాంగ్‌లీడ‌ర్‌. ఇప్ప‌టికే త‌మ అభిమాన హీరో సూప‌ర్ హిట్ సినిమా టైటిల్ నాని వాడుకోవ‌డంతో నానిపై గుర్రుగా ఉన్న మెగా అభిమానులు తాజాగా చేసిన ట్వీట్ చూసి మరింత మండిపోతున్నారు. నాని గ్యాంగ్ లీడర్ మూవీ సెప్టెంబర్ 13న విడుదల కాబోతున్న విషయాన్ని తెలిసిందే. ఇక నానికి సెప్టెంబ‌ర్ చాలా సెంటిమెంట్ నెల‌. ‘అష్టాచెమ్మా’ ‘భలేభలే మగాడివోయ్’ సెప్టెంబర్ లో విడుదలై సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు త‌న గ్యాంగ్‌లీడ‌ర్‌కు కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుంద‌న్న ధీమాతో ఉన్నాడు.

ఇక తాజాగా సాహో హిట్ అవ్వాల‌ని ట్వీట్ చేశాడు. ఇక సాహో కోసం త‌న సినిమా వాయిదా వేసుకుని త‌న సినిమాను మ‌రో మెగా హీరో వ‌రుణ్‌తేజ్ వాల్మీకికి పోటీగా రిలీజ్ చేస్తున్నాడు. ఇదే మెగా హీరోల అభిమానుల్లో తీవ్ర అస‌హ‌నానికి కార‌ణమైంది. సెప్టెంబర్ నెల మెగా హీరోలకు కలిసి వచ్చినంతగా ఇండస్ట్రీలో మరి ఏ హీరోకు కలిసి రాలేదు. సెప్టెంబర్ నెలలో అడవి దొంగ – ఠాగూర్ – అత్తారింటికి దారేది – సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ రిలీజ్ అయ్యి సూప‌ర్ హిట్ అయ్యాయి.

ఇప్పుడు నాని సాహో కోసం త‌న సినిమా వాయిదా వేసుకోవ‌డంతో పాటు ఆ సినిమా హిట్ అవ్వాల‌ని కోరుకోవ‌డంతో పాటు మెగా హీరో వాల్మీకి సినిమాకు పోటీగా రిలీజ్ చేస్తుండ‌డం, అది కూడా త‌మ మెగాస్టార్ సినిమా టైటిల్‌ను వాడేసుకోవ‌డంతో మెగా అభిమానులు సోష‌ల్ మీడియాలో నానిపై మండిప‌డుతున్నారు.
రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో మెగా హీరోల అభిమానుల కామెంట్లు పెరిగిపోతున్నాయి.

మ‌రికొంద‌రు మెగా హీరోల పేరిట ఫేక్ అక్కౌంట్లు క్రియేట్ చేసి మ‌రీ నానికి వార్నింగ్‌లు ఇస్తున్నారు. రేపు సినిమా రిలీజ్ రోజున వీరంతా గ్యాంగ్‌లీడ‌ర్‌ను గ‌ట్టిగానే టార్గెట్ చేయ‌నున్నారు. మ‌రి వీటిని త‌ట్టుకుని నాని సినిమా ఎలా నిల‌బ‌డుతుందో ? చూడాలి.

Leave a comment