త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న టాలీవుడ్ హీరో..

నాకు పెండ్లీ మీద ద్యాసే లేదు.. ఇంతవరకు ఆటు వైపు అలోచనలే చేయలేదు… సమయం వచ్చినప్పుడు పెండ్లి గురించి చెబుతా నంటూనే త్వరలోనే పెండ్లి చేసుకుంటానంటూ చెప్పకనే చెప్పేసాడు యువహీరో… ఇంతకు ఇలా చెప్పకనే చెప్పిన ఈ గడుసు హీరో ఎవరబ్బా అనుకుంటున్నారా… కనుక్కోండి చూద్దాం…

ఇంతకు టాలీవుడ్లో అనేకమంది యంగ్ హీరోలు ఉన్నారు. ఇందులో మోస్ట్ ఎలిజబుల్ పెండ్లి కొడుకు ఎవరైనా ఉన్నారా అంటే ఓ పెద్ద చాంతాడంత లీస్టు వస్తుంది. ఇందులో ఇంకా ముదిరిన పెండ్లి కొడుకుల లిస్ట్ తీస్తే ఇద్దరు హీరోలు వస్తారు.. ఒకరు బాహుబలి యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, మరొకరు ద లీడర్ రాణాలున్నారు. వీరితో పోటీలో నితిన్ శర్వానంద్ అలా అలా లిస్టు వస్తూనే ఉంటుంది. అయితే మరి పెండ్లి గురించి త్వరలోనే చెపుతానంటుంది ఎవరై ఉంటారబ్బ…

ప్రభాస్ గత ఐదేండ్లుగా పెండ్లి గురించి ప్రస్తావన తెస్తే బాహుబలి తరువాత అన్నాడు… ఇప్పుడు సాహో తరువాత అంటున్నాడు.. తరువాత ఎప్పుడు అంటాడో చూడాలి. ఇక రానా సంగతి సరేసరి. ఇక నితిన్, శర్వానంద్‌ల గురించి చెపుకుంటే అంతే సంగతులు.. అయితే ఇందులో రణరంగం మూవీతో హిట్ కొట్టిన శర్వానంద్‌కు ఇప్పటికే 35ఏండ్లు దాటిపోయిండు… అందుకే పెండ్లి ఎప్పుడు అని అడిగితే పెండ్లి గురించి ఆలోచించలేదు… కాని త్వరలోనే చెపుతానంటూ దాటేస్తున్నాడు… ఈ గడుసు సుందరుడు…

Leave a comment