టాలీవుడ్‌లో 2019 ఫస్టాఫ్ కంప్లీట్ అయ్యింది. తొలి ఆరు నెలల్లో `ఎఫ్ 2` బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మహేష్ నటించిన `మహర్షి` సక్సెస్ పెద్ద ఊరట. సినిమాకు యావరేజ్ టాక్ ఉన్నా పోటీ సినిమాలు లేకపోవడంతో వసూళ్లు బాగా వచ్చాయి. సమ్మర్ కూడా మహేష్‌కు కలిసొచ్చింది. మల్లేశం- బ్రోచేవారెవరురా లాంటి చిత్రాలు సేఫ్ జోన్ సినిమాలుగా నిలిచాయి. ఏజెంట్ ఆత్రేయ లాంటి సినిమాలు ఊహించని విజయాన్ని ఇచ్చాయి. కంటెంట్‌లో దమ్ముంటే ఎంత చిన్న సినిమా అయినా సూపర్ హిట్ అవుతుందన్న దానికి ఈ సినిమాయే ఉదాహరణ.
సెకండాఫ్ `ఓ బేబి`తో గుడ్ స్టార్ట్ అన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. లాంగ్ రన్‌లో మంచి వసూళ్లు బేబీకి ఖాయం కానున్నాయి. ఇక సెకండాఫ్ తొలి నెల జూలైలో పూరి జగన్నాథ్ – రామ్ ఇస్మార్ట్ శంకర్ వస్తోంది. శంకర్ 18న వస్తుంటే ఆ మరుసటి రోజే కౌశల్య కృష్ణమూర్తి రిలీజవుతోంది. విజయ్ దేవరకొండ – మైత్రి మూవీ మేకర్స్ సినిమా డియర్ కామ్రేడ్ జూలై 26న రిలీజవుతోంది.
ఇక ఆగస్టు 9న నాగార్జున మన్మథుడు సీక్వెల్ మన్మథుడు 2 రానుంది. ఇక రూ.300 కోట్ల భారీ బడ్జెట్ సినిమా సాహో ఆగస్టు 15న ఏకంగా మూడు భాషల్లో వస్తోంది. సాహోపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలిసిందే. జెర్సీ హిట్ తర్వాత నాని గ్యాంగ్‌లీడర్‌గద ఆగస్టు 30న వస్తున్నాడు. వరుస ఫ్లాపుల్లో ఉన్న కోలీవుడ్ హీరో సూర్య బందో బస్త్ ఆగస్టు 31న రిలీజవుతోంది. వరుణ్ తేజ్ `వాల్మీకి` పోస్టర్లు ఇప్పటికే వేడి పెంచాయి. ఓ బ్లాక్ బస్టర్ తమిళ చిత్రానికి రీమేక్ ఇది.
ఇక శర్వానంద్ రణరంగం వాయిదా పడింది. సెప్టెంబర్ 6న శర్వానంద్ రణరంగం – సెప్టెంబర్ 13న… గోపిచంద్ చాణక్య రిలీజ్ కానున్నాయి. శర్వా.. గోపిలకు సక్సెస్ చాలా ఇంపార్టెంట్. మెగాస్టార్ చిరంజీవి 151వ సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న రిలీజ్ ఖాయం చేశారని వినిపిస్తోంది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాపై కూడా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వస్తోంది.
సాహో తర్వాత ఆ రేంజ్ అంచనాలు సైరాపైనే ఉన్నాయి. ఇక మామా అల్లుళ్లు నటిస్తోన్న `వెంకీ మామ`పై అంచనాలున్నాయి. మామ- అల్లుళ్ల రచ్చపై అభిమానుల్లో ఆసక్తికర ముచ్చట సాగుతోంది. అక్టోబర్ 4న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇక డిసెంబర్‌లోనూ కొన్ని సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. మరి ఈ సినిమాల్లో ఏవి బాక్సాఫీస్ బాద్‌షా గా ఉంటాయో ? చూడాలి.