ప్రపంచకప్ ఏ ముహూర్తాన స్టార్ట్ అయ్యిందో కాని ఇండియాకు వరుసపెట్టి షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే విజయ్‌శంకర్‌ను పక్కన పెట్టడం, భువనేశ్వర్ గాయపడి కీలక మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడం… ఓ వైపు జట్టులో చోటు లేదని అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించడం… ధోనీ బ్యాటింగ్‌పై సీనియర్ల నుంచి దేశవ్యాప్తంగా విమర్శలు తలెత్తడం… భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో మిడిల్ ఆర్డర్ సమస్య ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు వెంటాడుతున్నాయి.
తాజాగా ఇప్పుడు ఇండియా మరో వివాదంలో చిక్కుకుంది. బంగ్లాదేశ్‌పై ఘనవిజయంతో టీం ఇండియా సెమీఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ప్రవర్తనకు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై రెండు మ్యాచుల నిషేధం విధించే అవకాశం ఉంది. మితిమీరి అపీల్ చేసినందుకు, ఫీల్డ్ అంపైర్లతో వాగ్వివాదానికి దిగడమే ఇందుకు కారణం.
బంగ్లాదేశ్ మ్యాచ్‌లో 11వ ఓవర్లో మహ్మద్ షమీ వేసిన బంతి సౌమ్య సర్కార్ ప్యాడ్స్ కు తాకింది. షమీ ఎల్బీడబ్ల్యు అపీల్ చేశాడు. అంపైర్ షమీ అప్పీల్ తోసిపుచ్చాడు. వెంటనే కోహ్లీ రివ్యూ కోరాడు. వికెట్ల వెనక ఉన్న ధోనీకి కూడా ఆ అవుట్‌పై సందేహం ఉండడంతో పట్టించుకోలేదు. చివరకు రివ్యూలో కూడా థర్డ్ అంపైర్ నాటవుట్ ప్రకటించాడు.
బంతి ఒకేసారి ప్యాడ్‌తో పాటు బ్యాట్‌ను తాకిందని డిసైడ్ అయిన థర్డ్ అంపైర్ నాటవుట్ ప్రకటించాడు. ఇండియా రివ్యూ కూడా కోల్పోయింది. దీంతో కోహ్లీ వెంటనే సహనం కోల్పోయాడు. వెంటనే అంపైర్ ఎరాస్మస్ తో వాదానికి దిగాడు. ఇక అప్ఘనిస్తాన్ మ్యాచ్‌లో కూడా కోహ్లీ అంపైర్‌తో వాగ్వివాదానికి దిగినందుకు మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు.
రెండేళ్ల వ్యవధిలో నాలుగు పాయింట్లు వస్తే సస్పెన్షన్ పాయింట్లుగా మారి ఆటగాడిపై ఒక టెస్టు లేదా రెండు వన్డేలు, లేదా రెండు టీ20 మ్యాచుల నిషేధం పడుతుంది. ఇప్పుడు శ్రీలంకతో మ్యాచ్‌లో కూడా అదే పరిస్థితి ఎదురైతే తర్వాత సెమీఫైనల్, ఫైనల్‌కు కోహ్లీ అందుబాటులో ఉండడు. ఈ మ్యాచ్‌లో అయినా కోహ్లీ జాగ్రత్తగా ఉంటాడని ఆశిద్దాం.