ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ మరో మూడు మ్యాచ్‌లతో ముగిసిపోతుంది. ప్రపంచ విజేత ఎవరో ఈ నెల 14న లార్డ్స్ లో జరిగే ఫైనల్లో తేలిపోనుంది. నెల రోజులుగా జరుగుతున్న ఈ టోర్నమెంట్ లీగ్ స్టేజ్ ముగిసి నాకౌట్ కు చేరుకుంది. లీగ్ దశలో తొలి నాలుగు స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ రెండో సెమీ ఫైనల్ …. న్యూజిలాండ్ – భారత్ తొలి సెమీ ఫైనల్లో తల పడుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సెమీఫైనల్స్‌లో గెలిచిన జట్లు ఈనెల 14న జరిగే ఫైనల్ మ్యాచ్లో తలపడతాయి.
ఇదిలా ఉంటే ఒకవేళ వర్షం తన ‘ఆట’ మొదలెడితే, ఆడలేని పరిస్థితుల్లో మ్యాచ్ రద్దు చేసే అవకాశం ఉంటుంది. లీగ్ స్టేజ్‌లో భారత్ – న్యూజిలాండ్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు జట్ల మధ్య జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో మాత్రం న్యూజిలాండ్ గెలిచింది. లీగ్ స్టేజ్ మ్యాచ్ రద్దవ్వడంతో
ఇరు జట్లకు ఒక్కో పాయింట్ ఇచ్చారు.
ఇక ఇప్పుడు నాకవుట్ స్టేజ్ కావడంతో తొలి రోజు మ్యాచ్ రద్దయితే రిజర్వ్‌డే ఉంటుంది. ఆ రోజు కూడా అంటే జులై 10న (రిజర్వ్‌డే) ఆటకు వర్షం ఆటంకం కలిగిస్తే లీగ్ స్టేజ్‌లో ఎక్కువ విజయాలు సాధించిన జట్టు ఫైనల్‌కు వెళుతుంది. ఈ లెక్కన లీగ్ స్టేజ్లో ఇండియా కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓడింది. న్యూజిలాండ్ కంటే ఎక్కువ విజయాలు ఉన్న ఇండియానే సెమీస్‌కు వెళుతుంది. అంటే వానదేవుడు విజృంభించి రిజర్వ్‌డే నాడు కూడా మైదానం ముంచెత్తితే ఇండియా మ్యాచ్ ఆడకుండానే ఎంచక్కా సెమీస్‌కు వెళుతుంది.