Gossipsచెన్నైలో ట్యాంక‌ర్ నీళ్ల రేటు తెలిస్తే మైండ్ బ్లాకే..

చెన్నైలో ట్యాంక‌ర్ నీళ్ల రేటు తెలిస్తే మైండ్ బ్లాకే..

తమిళనాడు రాజధాని చెన్నైలో నీళ్ల కొర‌త‌ రోజు రోజుకు మరింత తీవ్రమవుతోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను మించిపోయి మరి చెన్నైలో నీళ్ల కోసం కొట్టుకుంటున్నారు. హైదరాబాదులో ఇప్పటికే 80 శాతం మంది ఏదో ఒక సమయంలో ట్యాంకర్ నీళ్ల‌మీద‌ ఆధారపడుతున్నారు. ఈ ఏడాది జనవరి వరకు రూ. 1500 ఉన్న ట్యాంకర్ నీళ్ల ధ‌ర ఇప్పుడు మూడు వేలకు చేరుకుంది. అంటే కేవలం ఆరు నెలల కాలంలోనే రెట్టింపు అయ్యింది. ఇదిలా ఉంటే చెన్నైలో నీళ్ల‌ కోసం గత రెండు నెలల నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

చాలా హోటల్స్ లో త‌మ మెనూ నుంచి మీల్స్ సెక్ష‌న్్‌ కూడా ఎత్తివేశారు. ప్రస్తుతం టిఫెన్లు మాత్రమే అమ్ముతున్నారు. ఐటీ సంస్థ‌లు తమ ఉద్యోగులను ఇంటి దగ్గర నుంచి విధులు నిర్వహించుకోవాలని సూచిస్తున్నాయి. చెన్నైకు తమిళనాడు గ్రామీణ ప్రాంతాల నుంచి రైళ్ల ద్వారా నీరు అందిస్తున్న పరిస్థితి. ప్ర‌భుత్వం ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా నీళ్ల కొర‌త మాత్రం కంట్రోల్ కావ‌డం లేదు.

ఇదిలా ఉంటే.. చెన్నైలో ట్యాంకర్ల ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. ప్రస్తుతం పది వేల లీటర్ల నీటి ట్యాంకర్ రూ. 6 వేల నుంచి రూ.9 వేల వరకూ నడుస్తుంది. ఏ నీళ్ల ట్యాంక‌ర్ అయినా ఐదు కిలోమీట‌ర్ల నుంచి నీళ్లు తీసుకు వ‌స్తుంది. కానీ చెన్నైలో నీళ్ల ట్యాంకర్లు సరాసరిన వంద కిలోమీటర్ల దూరం వరకూ వెళ్లి తీసుకొస్తున్నాయట.

వంద కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లను తెస్తున్న కారణంగా రోజుకు వేసే ట్యాంకర్ల ట్రిప్పులు బాగా తగ్గిపోతున్నాయి. ఏదేమైనా భారీ వ‌ర్షాలు కురిస్తేనే త‌ప్పా చెన్నై నీటి కొర‌త ఇప్ప‌ట్లో త‌గ్గేలా లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news