Gossipsఎన్టీఆర్‌తో నాకు.. సమీరా షాకింగ్ రివీల్!

ఎన్టీఆర్‌తో నాకు.. సమీరా షాకింగ్ రివీల్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభంలో వరుసబెట్టి సినిమాలు చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ప్రతి సినిమాకు ఒక్కో హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తూ వచ్చాడు. కానీ తెలుగు బ్యూటీ సమీరా రెడ్డితో తారక్ రెండు సినిమాలు చేశాడు. అప్పట్లో వీరి జంట తెరపై అదుర్స్ అనిపించింది. ఇక వీరు పండించిన రొమాన్స్ కుర్రకారుకు పిచ్చెక్కించింది.

అయితే తాను ఇండస్ట్రీ నుండి వెళ్లిపోవడానికి కారణం తారక్ అని అంటోంది సమీరా రెడ్డి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అమ్మడు కొన్ని షాకింగ్ విషయాలను రివీల్ చేసింది. అప్పట్లో ఎన్టీఆర్‌తో కలిసి నటించినందుకు తాను హ్యాపీగా ఫీల్ అయ్యానని.. అయితే తనకు ఇండస్ట్రీలో తారక్ ఒక్కడే పరిచయం కావడంతో అతడితో సన్నిహితంగా మెదిలానని ఆమె అన్నది. దీంతో వారిద్దరిపై అనేక పుకార్లు పుట్టుకొచ్చాయి. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని సోషల్ మీడియాలో దుమ్ములేపిన గాసిప్స్ కారణంగా సమీరా రెడ్డి కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైందట. దీంతో తన కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ టాలీవుడ్‌కు దూరమయ్యానంటోంది సమీరా రెడ్డి.

మొత్తానికి ఓ ట్యాలెంటెడ్ హీరోయిన్‌ను ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం తారక్ అని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. అయితే గాసిప్స్ ఒక లిమిట్ వరకు ఉంటేనే బాగుంటాయని.. మితిమీరిన గాసిప్స్‌ తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయని ఆమె అంటోంది. ప్రస్తుతం రెండోసారి తల్లి కానున్న సమీరా రెడ్డి తన పర్సనల్ లైఫ్‌ను సాఫీగా కొనసాగిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news